నాడు చిరు కోసం..: పవన్ కల్యాణ్ మళ్లీ బ్రేక్ ఇస్తారా?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌కు మరోసారి బ్రేక్ పడనుందా? అంటే అవుననే అంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు పవన్ సిద్దమవుతున్నారనే వార్తలు జోరుగా వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ పెట్టడం లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన సినిమాలకు మరోసారి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్ చివరి సినిమా అత్తారింటికి దారేది. ఆ చిత్రం వచ్చి ఐదు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పవన్ మరో సినిమా ప్రారంభం కాలేదని, ఎన్నికల్లో పోటీ దృష్ట్యా మరికొద్దికాలం బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Short break to Pawan Kalyan films

2009లో సోదరుడు, ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. అప్పుడు సెట్స్ పైన ఉన్న పులి సినిమా కొన్ని నెలలు ఆగిపోయింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవనుందని అంటున్నారు.

ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2కు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికల డేట్ విడుదల కావడంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తలమునకలై ఉండే అవకాశముందంటున్నారు. అదే జరిగితే మరో మూడు నాలుగు నెలలు పవన్ కెరీర్‌కు బ్రేక్ పడనుందని చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కాకినాడ, మల్కాజిగిరి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారనే ప్రచారం రోజుగా సాగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+