జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యవహార శైలి: 'షాట్ రెడీ.. ప్యాకప్'

గుంటూరు: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యవహార శైలిపై బీసీ సంక్షేమ సంఘం యువజన శాఖ రాష్ట్రాధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గుంటూరు జిల్లాో ఆనందపేటలోని స్తానిక చుట్టగుంటలో గల రాష్ట్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. షూటింగ్‌లో పాల్గొన్నట్లు పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వచ్చిపోతున్నారని అన్నారు.

ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం

ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం


పవన్ కల్యాణ్ వ్యవహార శైలి షాట్ రెడీ.. ప్యాకప్ అనే రీతిలో ఉందని క్రాంతి కుమార్ వ్యాఖ్యానించారు. షాట్ రెడీ అన్నప్పుడు షూటింగులో పాల్గొన్నట్లు పవన్ కల్యాణ్ జనంలోి రావడం, ప్యాకప్ చెప్పగానే షూటింగ్ ముగించుకుని వెళ్లిపోయినట్లు పత్తా లేకుండా పోవడం పరిపాటిగా మారిందని అన్నారు.

ఆరు నెలలకు ఓసారి ప్రత్యక్షం

ఆరు నెలలకు ఓసారి ప్రత్యక్షం

అరు నెలలకు ఒకసార ప్రత్యక్షమయ్యే పవన్ కల్యాణ్ వల్ల ఏ విధమైన మేలు కూడా జరగదని క్రాంతి కుమార్ అన్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే పవన్ కల్యాణ్‌ను నమ్మడం లేదని అన్నారు.

ఉనికి చాటుకునేందుకే అలా..

ఉనికి చాటుకునేందుకే అలా..


ఉనికి చాటుకునేందుకు జనం మధ్యకు వచ్చే పవన్ కల్యాణ్‌ను ప్రజలు కూడా నమ్మడం లేదని క్రాంతి కుమార్ అన్నారు. ఇప్పటికైనా జనం మధ్యకు రావాలని ఆయన అన్నారు.

ఇప్పటికైనా మార్చుకోవాలి...

ఇప్పటికైనా మార్చుకోవాలి...


తన వ్యవహార శైలిని ఇప్పటికైనా మార్చుకుని జనం మధ్యలోకి వచ్చి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన క్రాంతి కుమార్ పవన్ కల్యాణ్‌కు సూచించారు. మీడియా సమవేశంలో సంఘం ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+