ప్రభుత్వం కూలుతుంది: సబ్బం, వ్యతిరేకిస్తాం: ఆనం
హైదరాబాద్/నెల్లూరు: ఓట్ ఆన్ అకౌంట్ సందర్భంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే యుపిఎ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. రెండున్నర ఏళ్ల క్రితం విభజన నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అన్నారు .
ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ జరగాలని, అందరి అభిప్రాయాలను చెప్పాల్సిందేనని పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. శనివారం ఏపిఎన్‌జిఓ హోంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతామని తెలిపారు. ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను చూసిన తర్వాత రాష్ట్రపతి పునరాలోచిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున విభజనతో రాజకీయ ప్రయోజనం పొందాలనే యోచనలో జాతీయ పార్టీలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాల వల్లే పార్లమెంటు సమావేశాలను రెండు రోజుల ముందు వాయిదా వేసుకున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చేసే ఆందోళనల్లో అన్ని పార్టీల జిల్లా అధ్యక్షులను భాగస్వాములను చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
సీమాంధ్రుల నష్టాలను కేంద్రం దృష్టికి: రఘువీరా
రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు జరిగే నష్టాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ఆర్‌డిఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.
అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లును తామంతా వ్యతిరేకిస్తున్నట్లు మరో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ఆయన శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి అధ్యక్షుడితోపాటు ప్రజాప్రతినిధులందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఏక తీర్మానంతోపాటు అవసరమైతే సభ్యుల మద్దతు కూడగట్టుకుని ఓటింగ్‌కు కూడా పట్టుబడతామని రాంనారాయణ రెడ్డి అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications