తిరుమల బ్రహ్మోత్సవాలు, శ్రీవారి మొదటి భక్తుడు హనుమంతుడు, హనుమంత వాహనంలో !
తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో భక్తులకు (devotees) దివ్యదర్శనమిచ్చారు. హనుమంత వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
తిరుమలకు (tirumala) విశేషంగా విచ్చేసిన భక్తులు (devotees) అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.హనుమంత వాహనం అంటే భగవత్ భక్తి ప్రాప్తి.హనుమంతుడు భగవత్ భక్తులలో (devotees) అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.

గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ (TTD) ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో (tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం హనుమంత వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుతంగా ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళాబృందాల్లో 305 మంది కళాకారులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తులను (devotees) పరవసింప చేశారు.
మహారాష్ట్రలోని థానే (thane) ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ బృందం ప్రదర్శించిన గోందల్ అనే నాట్య విన్యాసం భక్తులను (devotees) సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. 20 సంవత్సరాల లోపు యువతీ యువకులు మెరుపు వేగంతో అనేక గతులలో నృత్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరామ పట్టాభిషేకం కనువిందు చేసింది.

తణుకుకు చెందిన ఎన్.రాధిక ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన, తూర్పుగోదావరి జిల్లా నీడుదవోలుకు చెందిన ఎన్ .సరస్వతి బృందం డ్రమ్ముల నృత్యం, కర్ణాటకకు చెందిన జ్యోతి ఎన్ .హెగ్డే దాస సంకీర్తన నృత్యం అలరించాయి. అదేవిధంగా, విశాఖపట్నంకు (visakhapatnam) చెందిన డీవీఎల్. శిరీష బృందం కోలాటం, రాజమండ్రికి చెందిన డి.గాయత్రి బృందం ప్రదర్శించిన గోపికా కృష్ణుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
విశాఖపట్నంకు చెందిన బి సాయి రోజా కుమారి ప్రదర్శించిన కోలాటం, పాండిచ్చేరికి చెందిన ఎస్.మాలతి సెల్వం ఆధ్వర్యంలో ప్రదర్శించిన పొయికల్ కుదిరై, హర్యానా ప్రాంతానికి చెందిన పి.రాజి బృందం పన్హారీ నృత్యం, విజయవాడకు (vijayawada) చెందిన వై.వనజ బృందం కోలాటం, తిరుమల (tirumala) బాలాజీ నగరుకు చెందిన కె.శ్రీనివాసులు బృందం కోలాటం భక్తులను (devotees) ఎంతగానో ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications