వ్యభిచారం కేసు: శ్వేతాబసుకు హైదరాబాద్ కోర్టు క్లీన్‌చిట్
హైదరాబాద్: వ్యభిచారం చేస్తూ పట్టుబడిందనే ఆరోపణలకు సంబంధించిన కేసులో హీరోయిన్ శ్వేతాబసుకు హైదరాబాద్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హైదరాబాద్ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడిన శ్వేతాబసు ఊరట పొందినట్లు కనిపించారు.
హైదరాబాద్ సెషన్స్ కోర్టు తనకు క్లిన్ చిట్ ఇచ్చిన మాట నిజమేనని, అది ఎంతటి ఊరట అనే విషయాన్ని మాటల్లో చెప్పలేనని, ఇది తనకూ తన కుటుంబానికీ పెద్ద ఊరట అని, కొన్ని నెలల తర్వాత తాము నవ్వుగలుగుతున్నామని ఆమె అన్నారు. అటువంటి ఊరట కోసమే తాను నిరీక్షిస్తూ వస్తున్నట్లు తెలిపారు.

తన చుట్టూ అల్లిన కథ ఎంత వ్యర్థమైందో బయటపడిందని అన్నారు. తాను ఆనందంగా ఉన్నానని చెప్పారు. జీవితం అందంగా, ఆశావహంగా కనిపిస్తోందని అన్నారు. ఓ వర్గం మీడియా తనపై బురద చల్లడం బాధగా ఉందని అన్నారు. తన తరఫున వాదనను వినడానికి సమయం ఇవ్వాల్సి ఉండిందని శ్వేతాబసు అన్నారు.
తనకు క్లీన్ చిట్ వచ్చిందని, అది చాలునని, తనకు ఎవరి మీద కూడా కోపం లేదని ఆమె అన్నారు. కొన్నాళ్ల క్రితం వ్యభిచారం కేసులో శ్వేతాబసు పట్టుబడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆమెను రెస్క్యూ హోంకు పంపించింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications