Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను వదిలేస్తే డబ్బిస్తా : భార్యకు ఎస్ ఐ ఆఫర్, రెండో పెళ్ళికోసమేనంటున్న భార్య

రెండో వివాహం కోసం డబ్బులిస్తా తనను వెళ్ళిపోవాలని భర్త కోరుతున్నాడని చిత్తూరు జిల్లా కెవిబిపురం ఎస్ ఐ శివకుమార్ పై ఆయన భార్య నగీనా ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్ళిచేసుకొని రెండో పెళ్ళిచేసుకొనేందుకు

అనంతపురం :ప్రేమించాడు, ఉద్యోగం వచ్చాక పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో వివాహం చేసుకొన్నాడు. తాను ఎష్ ఐగా ఉద్యోగం సంపాదించడానికి తన ప్రియురాలు చేసిన ఆర్థిక సహయాన్ని తీసుకొన్నాడు. ప్రస్తుతం రెండో పెళ్ళి కోసం ఆమెను వేధిస్తున్నాడు. డబ్బులిస్తాను వెళ్ళిపో అంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.

అనంతపురం జిల్లా పరిగి మండలంలోని పెద్దరెడ్డిపల్లికి చెందిన శివకుమార్ , మడకశిరకు చెందిన షేక్ నగీనా హిందూపురంలో డిగ్రీ చదివే సమయంలో ప్రేమించుకొన్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఆమె కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించింది.ఆమె ఆర్థిక సహయంతో శివకుమార్ ఎంబిఏ పూర్తి చేశాడు.

కొంత కాలం తర్వాత శివకుమార్ విఆర్ ఓ పోస్టు సాధించాడు. అయితే వివాహం చేసుకొందామని నగీనా ప్రతిపాదించింది.అయితే తాను ఎస్ ఐ అయిన తర్వాతే వివాహం చేసుకొందామని ఆయన చెప్పాడు.

 si offers money to wife to leave him

అయితే ఇద్దరూ కూడ ఎస్ ఐ పోస్టు కోసం హైద్రాబాద్ లో కోచింగ్ తీసుకొన్నారు. నగీనాకు అవకాశం రాకపోగా , శివకుమార్ పోస్టు సాధించాడు. శిక్షణ సమయంలోనే పెళ్ళి చేసుకొందామని ప్రతిపాదించాడు.అప్పుడు కూడ శివకుమార్ స్పందించలేదు. పోలీసు అధికారుల సంఘం నాయకులను నగీనా ఆశ్రయించారు.

అయితే ఈ విషయమై పోలీసు అధికారుల సంఘం నాయకులు అనంతపురం జిల్లా ఎస్ పి రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయమై ఆయన స్పందించి ఇద్దరికీ అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలోనే 2015 డిసెంబర్ ఐదవ తేదిన వీరిద్దరికీ వివాహం చేశారు.

శిక్షణలో ఉన్న సమయంలోనే శివకుమార్ తండ్రికి జబ్బు చేస్తే నగీనా తన స్వంత డబ్బులతో వైద్యం చేయించిందని బాదితురాలు చెబుతోంది. శిక్షణ పూర్తైన తర్వాత చిత్తూరు జిల్లా కెవిబిపురం ఎస్ ఐ గా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా గుడిబండలో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న నగీనా భర్తతో కలిసి ఉండాలని భావించి రెండు నెలల క్రితం సెలవుపెట్టి అక్కడికి వెళ్ళారు.

కొన్ని రోజులకే శివకుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి వేధించడం ప్రారంభించాడని బాధితురాలు ఆరోపిస్తోంది.డబ్బు ఎంతైనా ఇస్తానని వెళ్ళిపోవాలని వేధించేవాడని ఆమె ఆరోపిస్తోంది. శివకుమార్ వ్యవహరశైలిపై వన్ టౌన్ సిఐకు నగీనా ఫిర్యాదు చేసింది. శివకుమార్ మరో వివాహనికి సిద్దపడి తనను వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+