తిరుమలలో ఎస్ఐ అనుచిత ప్రవర్తన: భక్తులను కాల్చిపారేస్తానంటూ తుపాకీతో బెదిరింపు
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఓ ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న సమాచారం అడిగిన పాపానికి భక్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఎస్సై.. సర్వీస్ రివాల్వర్ చూపించి కాల్చిపారేస్తానంటూ బెదిరించాడు.
సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జేఈవో ఆఫీసుకు ఎలా వెళ్లాలో తెలియక.. పక్కనే ఉన్న ఎస్ఐ నాగేశ్వర్‌ను అడిగారు.

ప్రజలకు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి.. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భక్తులపై విరుచుకుపడ్డారు ఎస్సై నాగేశ్వర్. సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి కాల్చేస్తానని బెదిరించాడు. ఎస్సై చర్యను నిరసిస్తూ భక్తులు వాగ్వాదానికి దిగారు.
దీంతో అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు భక్తులు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీఎస్సీ భక్తులకు సర్దిచెప్పి పంపించారు. కాగా, సదరు ఎస్సై నాగేశ్వర్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్‌పై తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications