ప్రేమించి పెళ్ళి చేసుకొన్న భార్యను మోసం చేసిన ఎస్ ఐ అరెస్టు
ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఎస్ ఐ, భార్యను కాదని మరో వివాహనికి సిద్దమయ్యాడు.అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లాలో ఎస్ ఐ గా పనిచేస్తున్న శివకుమార్ ను హిందూపురం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశా
హిందూపురం: ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఎస్ ఐ, భార్యను కాదని మరో వివాహనికి సిద్దమయ్యాడు.అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లాలో ఎస్ ఐ గా పనిచేస్తున్న శివకుమార్ ను హిందూపురం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
చిత్తూరు జిల్లాలో ఎస్ ఐ గా పనిచేస్తున్న శివకుమార్ అనంతపురం జిల్లా గుడిబండ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నగీనాను ప్రేమించి పెళ్ళి చేసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయమై బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో హిందూపురం పోలీసులు చిత్తూరు జిల్లాలో ఎస్ ఐ గా పనిచేస్తున్న శివకుమార్ ను అరెస్టు చేశారు.

కళాశాలలో చదివే సమయం నుండి ప్రేమించి, ఎస్ ఐ ఉద్యోగం రాగానే కానిస్టేబుల్ ను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో పనిచేసిన ఎస్పీ వారిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఆ తర్వాత పెళ్ళి కూడ చేశాడు. కాని, అతనిలో మార్పు రాలేదు. మరో పెళ్ళి చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండడంతో బాధితురాలు గత డిసెంబర్ లో హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎట్టకేలకు ఎస్ ఐ శివకుమార్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జడ్జి రిమాండ్ కు ఆదేశించారని ఎస్ ఐ దిలీప్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications