5 ప్రశ్నలు వేశాంగా.. సమాధానం చెప్పలేదేం: పవన్ కళ్యాణ్‌కు బీజేపీ చురక
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయవాడ: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ ఐదు అంశాల పైన.. రోజుకొకటి చొప్పున మంగళవారం నాటి వరకు స్పందించిన విషయం తెలిసిందే.
దీనిపై సిద్ధార్థనాథ్ సింగ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ పలు సమస్యల పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించే ముందు అధ్యయనం చేయాలన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఐదు అంశాల పైన సమాధానం చెప్పాలని గతంలోనే కోరామని గుర్తు చేశారు. గోవధ పైన ఆయా రాష్ట్రాలలో చట్టాలు ఉన్నాయని, ఈ విషయం గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు.
కాగా, పలు అంశాల మీద బీజేపీ పైన పవన్ కళ్యాణ్ ప్రశ్నాస్త్రాలు సంధించిన విషయం తాను 5 అంశాల పైన స్పందిస్తానని, రోజుకో అంశంపై మాట్లాడుతానని పవన్ ఈ నెల 15వ తేదీన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
1. గోవధ, 2. రోహిత్ వేముల ఆత్మహత్య, 3. దేశభక్తి, 4. నోట్ల రద్దు, 5. ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై స్పందిస్తానని చెప్పారు. వరుసగా ఈ అంశాలపై ఆయన స్పందిస్తూ వచ్చారు. దీనిపై సిద్ధార్థనాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications