అఖిలప్రియా! తేలిపోయింది: శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాలలో టిడిపి కొత్త డ్రామా, కానీ
తాను విలువలకు కట్టుబడి తాను శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని, తన రాజీనామాను ఆమోదించినందుకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌కు ధన్యవాదాలు అని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తాను విలువలకు కట్టుబడి తాను శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని, తన రాజీనామాను ఆమోదించినందుకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌కు ధన్యవాదాలు అని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.

అఖిలప్రియ రాజీనామా చేయాలి
ఆయన రాత్రి విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకొని రాజీనామా చేసిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.శిల్పా కుటుంబం నైతికతకు కట్టుబడి ఉందన్నారు. అఖిలప్రియ రాజీనామా చేసి మాట్లాడాలన్నారు.
Recommended Video


టిడిపి నేతలు దాడులు చేయిస్తున్నారు
మైనార్టీలు తమ కుటుంబ సభ్యుల్లాంటి వారని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. వైసిపి కార్యకర్తలపై టిడిపి నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి కార్యకర్తల బలమని, వారిని కాపాడుకుంటామని చెప్పారు. తమ మాటలను వక్రీకరిస్తూ అధికార పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి?
టిడిపి నేతల మాటలు చూస్తుంటే రాజకీయాలు ఎక్కడకు పోతున్నాయో అర్థం కావడం లేదని చక్రపాణి రెడ్డి అన్నారు. జగన్ సభలకు వస్తున్న ఆదరణ టిడిపి నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. ఒక్కొక్కరికీ రూ.300 ఇచ్చి జగన్ వెంట వెళ్లొద్దని బతిమాలుతున్నారన్నారు.

మైనార్టీ ఓట్ల కోసం బిజెపితో పొత్తుపై కొత్త డ్రామా
బిజెపితో పొత్తుపై టిడిపి నేతలు రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తు లేకపోతే బిజెపి మంత్రులతో రాజీనామా చేయించాలన్నారు. మైనార్టీ ఓట్ల కోసం టిడిపి నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బిజెపితో పొత్తు ఉండదని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ నంద్యాల ముస్లీంలకు అన్నీ తెలుసునని చెప్పారు.

అఖిలప్రియకు అది గౌరవం
మంత్రి అఖిలప్రియ మొదట రాజీనామా చేసి, ఆ తర్వాత మాట్లాడాలని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. అప్పుడే ఆమెకు గౌరవం ఉంటుందని చెప్పారు. నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో తన రాజీనామాతో తేలిపోయిందని అఖిలప్రియను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications