Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిజెపి వల్లే ఓడిపోయా, నేను కూడా చేశా: అఖిలకు శిల్పా కౌంటర్

తాను కూడా నంద్యాలను అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మంత్రి అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు.

కర్నూలు: తాను కూడా నంద్యాలను అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, వైసిపి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మంత్రి అఖిలప్రియకు కౌంటర్ ఇచ్చారు.

పార్టీలకు అతీతంగా భూమా నాగిరెడ్డి సేవలను, అభివృద్ధిని వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుని ఎన్నికలు ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత వైసిపికి ఉందని అఖిల ప్రియ తెలిపారు.

దీనిపై శిల్పా స్పందించారు. అధికార పార్టీ నేతలు కోరుతున్నట్లు ఏకగ్రీవం అసాధ్యమని తేల్చి చెప్పారు. నంద్యాలను ఎవరో ఒకరు అభివృద్ధి చేయలేదని, తాను కూడా చేశానని ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పారు. అధికారం, డబ్బుతో తెలుగుదేశం పార్టీ గెలవాలనుకుంటోందని ఆరోపించారు.

 Silpa Mohan Reddy reveals why he defeated in 2014 elections

టిడిపి అధికారం, డబ్బు ఉపయోగించాలనుకున్న ప్రజలు మాత్రం తన వైపు ఉన్నారని చెప్పారు. టిడిపి - బిజెపి పొత్తు వల్లే తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయానని ఆసక్తికర ప్రకటన చేశారు.

పొత్తు కారణంగా తన నియోజకవర్గంలో నిర్ణయాత్మక ఓటు బ్యాంకును కలిగి ఉన్న ముస్లీం ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని, అదే తన ఓటమికి కారణమైందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+