షాక్.. సింగపూర్‌కు రూ.లక్ష కోట్లు: బాబుపై రోజా సంచలనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఆరోపణలు చేసింది. సింగపూర్ ప్రభుత్వం రాజధాని కోసం ఉచిత సేవ చేసేందుకు టీడీపీకీ మేనమామనా అని, ప్లాన్ కోసం లక్ష కోట్ల నజరాన్ ఇచ్చారన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. రోజా మాట్లాడుతూ... కలెక్టర్ గారి నిజాయితీ చూస్తేనే పుష్కరాల ప్రమాదానికి చంద్రబాబు కారణమనే విషయం అర్థమవుతోందన్నారు.

పుష్కరాల సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు అక్కడ ఉన్నాడనే విషయం ఎస్పీ మాటల ద్వారా అర్థమవుతోందన్నారు.

Singapore's master plan for Andhra Pradesh sees it as a 'vibrant business hub'

ఓటుకు నోటు కేసు నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించారని, పుష్కరాల ఘటన ప్రమాదం పైనుంచి దృష్టిని మరల్చేందుకు హడావుడిగా ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ తీసుకు వచ్చారన్నారు. సమస్యల నుండి దృష్టి మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు.

ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ సేవ చేస్తోందా అని ప్రశ్నించారు. సింగపూర్ ప్రభుత్వం టిడిపి నేతలకు మేనమామనా అని ఘాటుగా ప్రశ్నించారు. సింగపూర్ పెద్ద బిజినెస్ దేశమని, అది ఫ్రీగా ఎందుకిస్తుందన్నారు. రాజధాని ప్లాన్ కోసం సింగపూర్‌కు లక్ష కోట్ల నజరానా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయన్నారు.

ప్రపంచ దేశాల్లో భారతీయులు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, రాజధానిని సింగపూర్‌కు అప్పగించడం ద్వారా మనల్ని అవమానించారన్నారు. రాజధాని సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు, బడుగులకు మాస్టర్ ప్లాన్లో చోటు ఎక్కడ అని ప్రశ్నించారు.

రాజధాని బాధ్యత సింగపూర్‌దా లేక కేంద్రానిదా అని ప్రశ్నించారు. రాజధాని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నిర్వాసితులకు ఏం చేస్తారో చెప్పలేదన్నారు. భూములిచ్చిన రైతులను కష్టపెడతారా అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ మానుకోని ప్రజల కోసం పని చేయాలన్నారు.

చంద్రబాబు ఓ సిఎంలా ముందుకెళ్లడం లేదన్నారు. ఆయనకు ఎందులోను స్పష్టత లేదని, ప్రతి దాని పైన వివరణ ఇవ్వాలన్నారు. పుష్కరాల ప్రమాద ఘటన నుండి దృష్టి మరల్చేందుకే సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు హడావుడి చేయించారన్నారు. మరోవైపు, అమరావతి మంచి బిజినెస్ హబ్ అవుతుందని ఏపి భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+