స్నేహం ఇలాగే: కెసిఆర్‌తో సింగపూర్ మంత్రి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో సింగపూర్ సహకారం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని హోటల్ గ్రాండ్‌కాకతీయలో సింగపూర్ మాజీ ప్రధాని, ప్రస్తుత సీనియర్ మంత్రి గోచోక్‌తంగ్ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఇటీవల తాను సింగపూర్ పర్యటన సందర్భంగా చూసిన ప్రాంతాలను, తెలుసుకున్న విషయాలను సీఎం ఆయనతో పంచుకున్నారు. పర్యటన స్ఫూర్తిదాయకంగా సాగిందని ముఖ్యమంత్రి వారితో అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ, ఇండసి్ట్రయల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని చెప్పారు.
వివిధ రంగాలకు సంబంధించి ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్నామని, ఆ తరువాత మరోసారి సమావేశమై సింగపూర్-తెలంగాణ సంయుక్తంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అవగాహన కుదుర్చుకుందామని ఇద్దరు నాయకులు అభిప్రాయపడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

కెసిఆర్‌తో సింగపూర్ సీనియర్ మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సింగపూర్ సీనియర్ మంత్రి గోచోక్ తంగ్ సోమవారంనాడు సమావేశమయ్యారు.

కెసిఆర్‌తో సింగపూర్ సీనియర్ మంత్రి
ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన కెసిఆర్‌ను సింగపూర్ సీనియర్ మంత్రి గోచోక్ తంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

కెసిఆర్‌తో సింగపూర్ సీనియర్ మంత్రి
తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించాలని తనను కలిసిన సింగపూర్ సీనియర్ మంత్రి గోచోక్ తంగ్‌ను కెసిఆర్ కోరారు.

కెసిఆర్‌తో సింగపూర్ సీనియర్ మంత్రి
తెలంగాణ, సింగపూర్ సంయుక్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కుదుర్చుకుందామని కెసిఆర్, గోచోక్ తంగ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications