రెండో పెళ్లి పుకార్లపై ప్రముఖ సినీ గాయని సునీత స్పందన:ఎందుకలా?

గుంటూరు: సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ ఎందుకంత ఆసక్తిని కనబరుస్తారు?...అంటూ ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించారు. 40 ఏళ్లకు చేరువైన సింగర్ సునీతకు 20 ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. 19 ఏళ్ల వయసులో ఆమె కిరణ్ ను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా కొంతకాలం కిందట ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

Singer Sunitas reaction over second marriage rumours

ఇప్పటివరకు వందలాది పాటలను పాడిన సునీత...డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. రాశి, భూమిక, అనుష్క, జ్యోతిక, ఛార్మి, మీరా జాస్మిన్, లైలా, సోనాలీ బెంద్రే, సౌందర్య, రిచా గంగోపాధ్యాయ్, శ్రియ, స్నేహ, జెనీలియా, కత్రినా కైఫ్, తమన్నా, ఇలియానా, కమిలినీ ముఖర్జీ, త్రిష, నయనతార తదితర హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెబుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+