రెండో పెళ్లికి శిరీష్ భరద్వాజ్ రెడీ, అంతకన్నా ఘనంగా?

హైదరాబాద్: శిరీష్ భరద్వాజ్ చాలా మందికి గుర్తుండే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. ఇంట్లో వాళ్లను ఎదిరించి శ్రీజ శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు వారి దాంపత్య జీవితం బాగానే ఉంది.

అయితే, ఏమైందో తెలియదు గానీ వారి జీవితంలో కలతలు మొదలయి విడాకులకు దారి తీసింది. ఆ తర్వాత శ్రీజకు రెండో పెళ్లి జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శిరీష్ భరద్వాజ్ కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Sirish Bharadwaj to marry a businessman's daughter?

ఈ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ కథనం ప్రకారం తాను ఘనంగా పెళ్లి చేసుకోవాలని శిరీష్ భరద్వాజ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓ పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం.

నిజానికి శ్రీజ పెళ్లి కంటే ముందే అతడు రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల అది ఆలస్యమైంది. త్వరలోనే శ్రీజకు, వారి కుటుంబానికి షాక్ ఇచ్చేలా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకోబోతున్నాడని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+