బూమ్ బూమ్ బీర్ కంపెనీల అసలు మ్యాటర్ లీక్ ?, చిత్రవిచిత్ర బ్రాండ్లు, సిట్ చేతిలో చరిత్ర?
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇంటిలో సీఐడీ సోదాలు చెయ్యడంతో ఇంతకాలం పలు బ్రాండ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో మద్యం సరఫరా చేసిన కంపెనీల యాజమాన్యాలకు గుబులు మొదలైయ్యిందని తెలిసింది వాసుదేవ రెడ్డి ఇంటిలో పలు కీలక పత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అందులో ఏముంది ? అనే విషయంపై వైసీపీ నాయకులకు దడ మొదలైయ్యిందని సమాచారం.
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో దేశంలో పేరు పొందిన బ్రాండ్ కంపెనీల మద్యం కాకుండా దేశంలోనే ఎక్కడా లేని చిత్రవిచిత్రమైన బ్రాండ్ల పేరుతో మద్యం విక్రయించారు. బూమ్ బూమ్ బీర్లు మొదలుకొని విస్కీ, బ్రాందీ, రమ్, జిన్ ఇలా అన్ని రకాల విచిత్రమైన బ్రాండ్ల పేరుతో మద్యం విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం కాక ముందు ఆ కంపెనీలు ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి బ్రాండ్ల మద్యం విక్రయించారా ? అని ఆరా తీయ్యాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల పేర్లు దేశంలో ఎక్కడా మేము వినలేదని అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మద్యం దుకాణాలకు విదేశాల నుంచి కూడా మద్యం దిగుమతి కాలేదు. ఇంక ఎక్కడి నుంచి అలాంటి లిక్కర్ కంపెనీలు పుట్టుకు వచ్చాయి అని ఆరా తియ్యాలని కూటమి నాయకులు కొందరు సంబంధిత అధికారులకు సూచించారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కొలువుతీరిన తరువాత కొత్తకొత్త లిక్కర్ కంపెనీలు ప్రారంభించారా ?, ఆ కంపెనీల యజమానులు ఎవరు ?, లిక్కర్ కంపెనీల యజమానులకు వైసీపీ నాయకులకు ఏమైనా సంబందం ఉందా ?, అని అధికారులు సమాచారం సేకరిస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం స్వీకరించిన తరువాత ఆ పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. మొత్తం మీద బూమ్ బూమ్ బీర్లతో పాటు పలు బ్రాండ్ల మద్యం సరఫరా చేసిన కంపెనీలకు ఇప్పుడు ఒణుకు మొదలైయ్యిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం విక్రయించిన లిక్కర్ బ్రాండ్ల గురించి టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా వైసీపీ ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు. మా అన్నా జగన్ ప్రేజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అందుకే నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications