లడ్డూ కేసులో టీటీడీ మాజీ ముఖ్యుల పై గురి - కీలక పరిణామం..!!
సంచలనంగా మారిన తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో విస్తు పోయే విషయాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటి కే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. కీలక స్థానాల్లో నిలిచిన ముగ్గురు మాజీ లపైన ఫోకస్ చేసారు. వీరికి నోటీసు లు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ ముగ్గురు మాజీ ప్రముఖులకు లుకౌట్ నోటీసుల జారీకి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. లడ్డూ కేసులో ఈ ఇద్దరి విచారణ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారనుంది.
కీలక పరిణామం
సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ తిరుపతి కేంద్రంగా విచారణ సాగిస్తోంది. నెయ్యి టెండర్ల నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు పరిశీలన చేసింది. నెయ్యి సర ఫరా చేసిన సంస్థల్లో సోదాలు చేసి... నలుగురిని అరెస్ట్ చేసింది. అదే సమయంలో తిరుమలలో లోనూ ఆరా తీసింది. కాగా, ఈ కేసు విచారనలో మరో కీలక నిర్ణయం దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. లడ్డూ కల్తీ ఆరోపణల పైన సిట్ లోతుగా అధ్యయనం చేస్తోంది. కాగా, ఈ కేసులో సిట్ మొదటి ఛార్జిషీట్ వేయనున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా సిట్ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చిన సిట్... నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురు ప్రముఖులకు
టీటీడీలో గతంలో పాలనా పరంగా దిశా నిర్దేశం చేసే హోదాలో పని చేసిన ఇద్దరు మాజీ ప్రముఖు లతో పాటుగా.. నిర్ణయాల అమలులో అధికార యంత్రాంగానికి పెద్దగా వ్యవహరించిన మరో మాజీ కీలక అధికారికి నోటీసులు జారీకి రంగం సిద్దమైనట్లు విశ్వస నీయ సమాచారం. ఇప్పటికే పులువురి ని విచారించిన సిట్.. ఈ ప్రముఖు వ్యక్తుల పాత్ర పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. వారికి నోటీసు లు ఇచ్చి నెయ్యి టెండర్లు.. కల్తీ ఆరోపణలు వంటి ఆరోపణల పైన సమాచారం సేకరించే విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీరికి నోటీసులు జారీ చేస్తే.. ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకొ నే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏఆర్ డెయిరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్టవి డెయిరీ సీఈవో అపూర్వా చావడాల విచారణ పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications