మరో ఆరు స్మార్ట్ సిటీలు, వారికి 35 శాతం జీతాల పెంపు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, కాకినాడలను కేంద్రం స్మార్ట్ సిటీలుగా ప్రకటించగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరికొన్ని ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని ఏపీ కేబినెట్ నిర్ణయించి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, కాకినాడలను కేంద్రం స్మార్ట్ సిటీలుగా ప్రకటించగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరికొన్ని ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని ఏపీ కేబినెట్ గురువారం నిర్ణయించింది.
కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలులను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన సుమారు ఐదు గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. 28 అంశాల ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

- అమరావతిలో ఔటర్ (186 కిలోమీటర్లు), ఇన్నర్ రింగ్ రోడ్ల (98 కిలోమీటర్లు) నిర్మాణానికి ఆమోదం
- విజయవాడలోని జక్కంపూడిలో 265 ఎకరాల్లో ఆర్థికనగరం అభివృద్ధికి ఆమోదం
- విశాఖలోని 11 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం
- మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారులకు లైసెన్సులు ఇస్తారు.
- సవరించిన మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్‌కు ఆమోదం.
- విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో 27 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో సిటీ స్క్వేర్ సెంటర్‌కు ఆమోదం.
- విజయవాడ - గుంటూరు అభివృద్ధికి అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు.
- సెర్చ్‌లో పని చేసే ఉద్యోగులకు 35 శాతం జీతాలు పెంపుకు ఆమోదం. దీంతో ఐదు వేల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.
- వాతావరణం ఆధారంగా రైతులకు బీమా సొమ్ము చెల్లింపు.
మరోవైపు, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం పైన కూడా కేబినెట్లో చర్చించారు. ఆస్తుల వేలంలో పారదర్శకత ఉండాలన్నారు. వేలంలో ధరలను తక్కువ కోట్ చేసేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. వారి ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. ఎక్కువ ధరకు ఆస్తుల వేలం జరిగేలా చూడాలన్నారు.
వెంకయ్యకు చంద్రబాబు లేఖ
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లేఖ రాశారు. కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు మరో ఏడాది గడువు పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ పనులు దశలవారీగా జరుగుతున్నందున ఆ గడువును పెంచాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications