గ్యాంగ్ రేప్ సీన్స్: 4గురు స్నేక్ గ్యాంగ్ సభ్యుల అరెస్టు

హైదరాబాద్: నలుగురు స్నేక్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. హైదరాబాదులోని పాతబస్తీలోని షాహిన్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సామూహిక అత్యాచారం దృశ్యాలను వాట్సప్ ద్వారా పంపిణీ చేసిన ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారిని వలవేసి పట్టుకున్నారు. స్నేక్ గ్యాంగ్ దృశ్యాలను వారు సోషల్ మీడియాలో పెట్టారు.

వాట్సప్ ద్వారా బాధితుల వీడియోలను ప్రచారంలో పెట్టిన సయ్యద్ బిన్ సలీం, మహ్మద్ బిన్ ఇబ్రహీం, మోసిన్ ఒమర్, అబీబ్ ఉస్మాన్ అరెస్టయినవారిలో ఉన్నారు. బాధితుల వీడియోలను ప్రసారం చేసిన ఆరు టీవీ చానెళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Six Snake gang members arrested

హైదరాబాదులోని పాతబస్తీలో గల ఫామ్‌హౌస్‌లో కాబోయే భర్తను మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై స్నేక్ గ్యాంగ్ సభ్యులు సామూహిక అత్యాచారం చేశారు. పాములతో భయపెట్టి మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దయానీని పోలీసులు అరెస్టు చేశారు. మరి కొంత మంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కొటొక్కటే బయపడుతుంటే బయటి ప్రపంచం దిమ్మెరపోయింది. స్నేక్ గ్యాంగ్‌పై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. నిందితులను విచారించిన తర్వాత మరిన్న చర్యలకు పోలీసులు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+