ఎల్‌నినో ప్రభావం వేళ రైతుల రుణాల పై కీలక నిర్ణయం, బిగ్ రిలీఫ్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా.. వారికి తోడ్పాటు అందించే నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా బ్యాంకు రుణాల పైన తాజా నిర్ణయం వెల్లడించారు. ఈ కరువు మండలాల్లో వర్తించే రుణాల రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ అన్నదాతలకు రాష్ట్ర ఊరటనిచ్చే కబురు అందించాయి. ఇటీవల వర్షాభావం కారణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 380 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో, ఆయా మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక నిర్ణయం తీసు కుంది. అందు లో భాగంగా ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రుణాల రీ షెడ్యూల్ నిర్ణయం కరువు ప్రభావిత ప్రాంతాల్లో అక్టోబర్ నాటికి 'స్టాండర్డ్ కేటగిరీ'లో ఉన్న రైతు రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని మండలాలతో పాటు ఇతర కరువు మండలాల్లోని రైతులకు రుణాలు చెల్లించేందుకు ఏకంగా 60 నెలల (5 ఏళ్ల) సుదీర్ఘ గడువును పొడిగించారు.

రుణాల రీ షెడ్యూల్ తో ఉపశమనం
ఈ నిర్ణయం ద్వారా బ్యాంకర్ల నుంచి ఎలాంటి రికవరీ ఒత్తిడి లేకుండా రైతులకు రిలీఫ్ దక్కనుంది. ఈ రుణ రీషెడ్యూల్ కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ, పట్టు పెంపకం, అగ్రో/ఆహార శుద్ధి యూనిట్లకు తీసుకున్న రుణాలకు కూడా విస్తరించనుంది. కష్ట కాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవతో బ్యాంకర్లు ఈ వెసులుబాటు కల్పించడంతో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతాంగానికి వెసులు బాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా.. కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైనా కసరత్తు జరుగుతోంది. ఈ నెలలోనే ఈ నిధులను అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.













Click it and Unblock the Notifications
