తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 72,528 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.41 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
కాగా- స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచనలు ఇచ్చింది. ఆయా టికెట్లు ఉన్న భక్తులు- వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలో మాత్రమే క్యూలైన్ లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధనను సోమవారం నుండి కఠినంగా అమలు చేస్తోన్నామని తేల్చి చెప్పింది.

భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించింది. అలాగే తమకు కేటాయించిన స్లాట్ టైమ్ లో మాత్రమే క్యూ లైన్ లో ప్రవేశించి, సమయ నిబంధనలను పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తోంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు కోరింది.
మరోవంక- వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చర్యలు చేపట్టింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంటోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా అన్నప్రసాదం, మంచినీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయాలని నిర్ణయించింది.
భక్తుల దాహార్తిని తీర్చడానికి తిరుమలలో విరివిగా మజ్జిగ పంపిణీ పాయింట్లు ఏర్పాటు కానున్నాయి. వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత మెరుగుపడనున్నాయి. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ అందుబాటులోకి రానున్నాయి. వేసవిలో కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, వారికి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.
-
రేపే తిరుచానూర్ ఆలయంలో.. !! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications