బాలుడిపై అన్నదమ్ములైన ఇద్దరు మైనర్ల అసహజ లైంగిక దాడి...ఆలస్యంగా వెలుగులోకి
నెల్లూరు:అన్నెంపెన్నెం ఎరుగని అమాయక చిన్నారి బాలుడిపై అన్నదమ్ములైన ఇద్దరు మైనర్ బాలురు కొంతకాలంగా అసహజ లైంగికదాడికి పాల్పడుతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఈ విషయమై పోలీసు కేసు నమోదు కావడంతో బైటకు తెలిసింది. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు నగరానికి చెందిన ఓ జంటకు రెండవ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. వీరు నివాసం ఉంటున్న ఇంటి కింద పోర్షన్ లోనే అద్దెకు ఉంటున్న కుటుంబంలో మైనర్లు అయిన ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. రోజూ ఈ బాలుడి తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళుతుండటంతో ఆ అన్నదమ్ములు ఇంట్లో వంటరిగా ఉండే ఆ బాలుడికి కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు.

ఆ తరువాత ఆ బాలుడిని తమ ఇంట్లోకి పిలిచి ఆ చిన్నారిపై మూడు నెలలుగా అసహజ రీతితో లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెపితే నీ తల్లిదండ్రులకు చెప్పి తీవ్రంగా కొట్టిస్తామని బాలుడిని బెదిరించేవారని తెలిసింది. ఈక్రమంలో ఇటీవలి కాలంలో బాలుడు వింతగా ప్రవర్తిస్తుండటం తండ్రి గమనించాడు. ఆ తరువాత బాలుడిని లాలించి మెల్లగా విషయాలు రాబట్టారు.
దీంతో జరుగుతున్న దారుణం గురించి తెలిసింది. దీంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రులు ఆ వికృత ఘటనల గురించి వెంటనే సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే తాను కేసు పెట్టిన తెలియగానే ఆ అన్నదమ్ములు మర్యాదగా కేసు ఉపసంహరించుకోవాలని, లేదంటే నీ అంతు చూస్తామని తనను బెదిరిస్తున్నట్లు కూడా మరోసారి బాధిత బాలుడి తండ్రి పోలీసులతో గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో పోలీసులు ఆ అన్నదమ్ములిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications