వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అతి తక్కువ బరువున్న శిశువు జననం.. కేవలం 480 గ్రాములే..

|
Google Oneindia TeluguNews

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువు కనీసం 3.2 నుంచి 3.4 కేజీలు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అయితే పేదరికం కారణంగా సరైన సంరక్షణ లేకనో.. లేక జన్యుపరమైన లోపాలతోనో కొన్ని సందర్భాల్లో అతి తక్కువ బరువుతో శిశువులు జన్మనిస్తారు. తాజాగా విశాఖపట్నం జిల్లాపాడేరులో ఉల్లి కృష్ణకుమారి అనే గర్భిణి స్త్రీ అతి తక్కువ బరువున్న శిశువుకు జన్మనించింది.

సంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శంసంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శం

కష్టంగా కాన్పు.. శిశువు బరువు 480 గ్రా.

కష్టంగా కాన్పు.. శిశువు బరువు 480 గ్రా.

ఈ శిశువు బరువు కేవలం 480 గ్రాములు మాత్రమే. పెదబయలు మండలం గలగండ పంచాయతీ గసాబు గ్రామానికి చెందిన కృష్ణకుమారికి ఈ నెల 9న పురిటి నొప్పులు రావడంతో ఆమెను పాడేరు ఆసుపత్రికి తరలించారు. నిజానికి మొదట ఆమెకు అబార్షన్ చేయాలని వైద్యులు భావించారు. అయితే స్కానింగ్ రిపోర్టుల్లో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలడంతో డెలివరీ చేశారు. కాన్పు కోసం వైద్యులు చాలానే శ్రమించినట్టు తెలుస్తోంది.కృష్ణకుమారికి మగబిడ్డ జన్మనించగా.. కేవలం 480 గ్రాముల బరువే ఉండటంతో బేబీ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంత తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ.. ఇప్పటివరకూ జీవించి ఉండటం రాష్ట్రంలో ఇదే ప్రథమం అని చెప్పారు.

జపాన్‌లో అతి తక్కువ బరువున్న శిశువు జననం..

జపాన్‌లో అతి తక్కువ బరువున్న శిశువు జననం..

అక్టోబర్,2018లో ప్రపంచంలోనే అత్యంత తక్కువ బరువున్న శిశువు జపాన్‌లో జన్మించింది. ఈ శిశువు బరువు కేవలం 258 గ్రాములు మాత్రమే. ర్యుసుకే సెకియాగా నామకరణం చేసిన ఈ శిశువు కేవలం 24 వారాలకే తల్లి కడుపు నుంచి బయటకొచ్చింది. 2017లో జపాన్‌లోనే జన్మించిన మరో శిశువు కేవలం 268 గ్రాముల బరువుతో జన్మించాడు. ర్యుసుకే జన్మించినప్పుడు ఆ శిశువు కేవలం 8.66 అంగుళాలు(22 సెం.మీ) పొడవు మాత్రమే ఉంది. దీంతో వైద్యులు ఆ శిశువును నియోనతల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు.

Recommended Video

Gas Leak in Telangana's Sirpur Kagaznagar Paper Mill After Vizag Lg Polymers
పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జి..

పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జి..

ఇంటెన్సివ్ యూనిట్‌లో ట్యూబ్‌ల ద్వారా ఆ శిశువుకు ఆహారం అందించారు. కొన్నిసార్లు కాటన్ స్వాబ్స్‌తోనే తల్లి పాలను అందించారు. అయితే దాదాపు 7 నెలల తర్వాత ర్యుసుకే 13 రెట్లు బరువు పెరిగాడు. అంటే,3కేజీల బరువుకు చేరుకున్నాడు. ఆరోగ్యంగా ఉండటంతో ఆ తర్వాత కొద్దిరోజులకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 'నిజానికి తనకు బాబు పుట్టినప్పుడు ముట్టుకుంటేనే విరిగిపోతాడేమోనని బాధపడ్డాను. కానీ ఇప్పుడు తను పాలు తాగుతున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు.' అని ఆమె తల్లి అప్పట్లో వెల్లడించింది.

English summary
A smallest infant was born in Paderu,his weight is just 480grams. Currently he is getting treatment in baby care unit,his mother is worrying about his health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X