పవన్ సభలో అపశృతి: వాహనం నుంచి పొగలు...వెంటనే వాహనం దిగిన జనసేనాని

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అక్కడ ఏడురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. పవన్ ఓ వాహనంపై నుంచి ప్రసంగిస్తుండగా... ఆ వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది వెంటనే పవన్ కళ్యాణ్‌ను వాహనం నుంచి దించివేశారు. అయితే వాహనం ఇంజిన్ ఆన్‌లోనే ఉండటంతో ఎండవేడిమికి పొగలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే ఇంజిన్‌ను ఆపివేశాడు. ఇంజిన్‌ వేడెక్కడంతోనే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాహనం నుంచి దిగిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. అయితే ఈ ఘటనతో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రసంగం ముగించుకుని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Smoke engulfs in Pawan Vehicle...incident occured in Srikakulam

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా నేతలు ప్రసంగిస్తున్న సమయంలో పలు అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రసంగిస్తున్న సమయంలో పిట్టగోడ కూలి పలువురికి గాయాలు కాగా... నంద్యాలలో జరిగిన పవన్ సభలో ఓ మైకు సౌండ్ సిస్టం ఓ యువకుడిపై పడి అతను మృతి చెందాడు. మరోవైపు నారాలోకేష్ ప్రసంగిస్తుండగా ఓ ఫ్లెక్సీ అక్కడున్న వారిపై పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+