వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ పోల్ సాయం: మారిషస్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

మారిషస్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు మారిషస్‌లో సోమవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే గంగిరెడ్డిపై పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్ పోల్ సాయంతో గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.

గంగిరెడ్డిని అరెస్ట్ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ధృవీకరించినట్లు సమాచారం. గంగిరెడ్డిని పట్టుకోవడానికి చాలా కాలం నుంచి పోలీసులు గాలిస్తున్నారు. గంగిరెడ్డిని పట్టుకోవడానికి అంతర్జాతీయ సంస్థ ఇంటర్‌పోల్‌ కూడా రంగంలోకి దిగింది.

Smuggler Gangi Reddy arrested

ఈ నేపథ్యంలో ఇంటర్‌పోల్‌ అధికారులు గంగిరెడ్డి ఫోటోను ఇంటర్నెట్‌లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్‌గానే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన హత్యాయత్నం కేసులోనూ ప్రధాన నిందితుడు కావడంతో అతన్ని పట్టుకోవడానికి ఏపీ పోలీసులు కూడా గాలింపు చేపట్టారు.

అంతర్జాతీయ స్మగ్లర్‌గా పెరుపొందిన గంగిరెడ్డి విదేశాలలో తలదాచుకున్నట్లుగా భావించిన ఏపీ పోలీసులు ఏసీబీ అధికారుల ద్వారా ఇంటర్‌పోల్‌ అధికారులకు నోటీసులు అందజేశారు. ఈ క్రమంలోనే ఇంటర్‌ పోల్‌ అధికారులు గంగిరెడ్డి ఫోటోను ఇంటర్‌నెట్‌లో పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు. 9నెలలుగా విదేశాల్లో తలదాచుకున్న గంగిరెడ్డిని చివరకు మారిషస్‌లో ఇంటర్ పోల్ సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
Smuggler Gangi Reddy arrested in Chandigarh on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X