కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేజింగ్ తో ఎస్పీకి ముచ్చెమటలు పట్టించిన స్నేక్

|
Google Oneindia TeluguNews

అనంతపురం : ఇప్పటిదాకా చేజింగ్ అంటే మనకు గుర్తుకొచ్చేది..! హీరోనో, విలన్నో పదుల కొద్ది సుమోలు తరమడం లాంటి సీన్ లే. కానీ ఇది విన్నాక.. ఇలాంటి తరహా చేజింగ్ లు కూడా ఉంటాయా? అని అనిపించకమానదు. ఎందుకంటే.. ఇక్కడ మనుషులను చేజ్ చేయడానికి ప్రయత్నించింది ఓ పాము.

దైవ దర్శనం కోసం వెళ్లిన ఓ ఎస్పీకి పాము దర్శనం అయింది. ప్రశాంతత కోసం ప్లాన్ చేసుకున్న టూర్ కాస్త.. హడలెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది. బోటును వెంబడిస్తూ వెనకాలే తరుముకొచ్చిన పాము కొద్దిసేపు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

Snake chases Kurnool SP travelling in boat

అసలు విషయమేంటంటే.. కృష్ణా నదిలో ఉన్న సంఘమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి కర్నూల్ ఎస్సీ రవికుమార్ సహా మరికొంతమంది ఓ బృదంగా బయలుదేరారు. ఎలక్ట్రిసిటీతో నడిచే ఓ చిన్న బోటులో ఆ బృదమంతా ఆలయ దర్శనం కోసం వెళ్లింది. అయితే శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తిగా మునిగిపోయిన సంఘమేశ్వర స్వామి ఆలయం కేవలం గోపురం మాత్రమే బయటకు కనిపిస్తుండడంతో గోపురాన్ని దర్శించుకుని రావాలనుకున్నారు.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది.. తీరా గోపురం దగ్గరకు వెళ్లాక, గోపురంపై ఓ పాము దర్శనమివ్వడం అందరిని కంగారు పడేలా చేసింది. అంతేకాదు ఉన్నట్టుండి.. పాము ఒక్కసారిగా బోట్ లోకి రావడానికి ప్రయత్నించడంతో.. బోట్ లో ఉన్నవారికి ముచ్చెమటలు పట్టాయి. అలా.. కొద్ది దూరం పాటు పాము బోట్ ను వెంబడిస్తూ వెనకాలే తరుముకు రావడంతో.. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తరహా అనుభవం ఎదురైంది. అయితే సదరు బోట్ మ్యాన్ ఎలాగోలా ఆ పాము చేజింగ్ ప్రయత్నాలకు చెక్ పెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary
A snake gave some tense moments to the Kurnool SP and his team who were in a boat on the River Krishna near Sangameswaram temple in Kurnool district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X