స్నేక్ గ్యాంగ్ వీడియో: చానల్‌పై కేసు, మరో 4గురి అరెస్ట్
హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ లైంగిక దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఓ టీవీ ఛానల్ ప్రసారం చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు పాతబస్తీలోని పహాడీషరీఫ్‌లో పాములతో బెదిరించి పలువురిపై అత్యాచారాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ ఉదంతం తెలిసిందే.
ఈ వీడియోలను ఓ టీవీ చానల్ ప్రసారం చేసినందుకు కేసు నమోదయిందని సమాచారం. స్నేక్ గ్యాంగ్ లైంగిక దాడులకు పాల్పడుతూ తీసిన వీడియో క్లిప్పింగ్స్‌ను సదరు టీవీ చానల్ ప్రసారం చేసింది. ఈ వీడియో క్లిప్పింగ్స్ వాట్సప్‌లో పంపినా కూడా కేసులు నమోదు చేస్తామని డీసీపీ జానకీ షర్మిల తెలిపారు. ఈ దృశ్యాలు ఎవరి ఫోన్లో ఉన్నా వెంటనే తీసివేయాలన్నారు.

లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎవరు పంపించారు.. అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ వీడియోలకు సంబంధించిన సమాచారం ఏదైనా తెలిస్తే చెప్పాలని పోలీసులు తెలిపారు.
మరోవైపు, స్నేక్ గ్యాంగ్ నిందితుల్లో మిగిలిన వారిని పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పహాడీషరీఫ్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఇతర సభ్యుల కోసం వేట కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం గౌస్ నగర్లో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుమానితులైన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications