స్నేక్ గ్యాంగ్: గుర్రాలు, కారు, బైక్‌లు స్వాధీనం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పహాడీషరీఫ్ పరిధిలో గత అర్థరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 350 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ సీపీ ఆనంద్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్నేక్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ ఇంట్లో రెండు గుర్రాలు, కారు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫైసల్ దయానీ సోదరులు అమీర్, అఖిల్‌లను అరెస్ట్ చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠా సభ్యులు చోరీల కోసం గుర్రాలను వాడారని ఆరోపిస్తూ జంతు హింస కింద కేసు నమోదు చేశారు. అలాగే తనిఖీల్లో భాగంగా 8 మంది రౌడీ షీటర్లు, మరో 11 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనుమానితుల్లో ఐదుగురు స్నేక్ గ్యాంగ్ నిందితులకు సహకరించినట్టు సమాచారం. 30 బైక్‌లు, మూడు వ్యాన్‌లు, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో కాబోయే భర్తను నిర్బంధించి యువతిని పాములతో బెదిరించి, వివస్త్రను చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.
స్నేక్ గ్యాంగ్ సభ్యులపై పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. స్నేక్ గ్యాంగ్ తాము చేసిన నేరాలను వీడియోల్లో చిత్రీకరించింది. ఆ వీడియోలను ప్రసారం చేసిన టీవీ చానెల్‌పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్నేక్ గ్యాంగ్ ఘటనలో మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. తనిఖీల్లో భాగంగా ఎటువంటి ఆధారాలు లేని 30 టూవీలర్లను, ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications