అవార్డు వచ్చిన ఆనంద క్షణాలు: భార్యా బిడ్డలతో పుష్ప స్టైల్‌లో..!!

అమరావతి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప- ది రైజ్ సినిమాలో చూపిన నటనకు ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈ సినిమాలో గంధపు చెక్కల వర్కర్‌గా, స్మగ్లర్‌గా విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నామినేట్ కావడం పట్ల టాలీవుడ్ స్పందిస్తోంది. ఆయనను అభినందిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్ట్ చేస్తోన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు. నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా చాలామంది సినీ పెద్దలు అల్లుకు విషెస్ తెలియజేస్తోన్నారు.

Allu Arjun

అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ బంగళా బ్లెస్సింగ్స్ వద్ద కూడా సందడి నెలకొంది. ఆయనకు అవార్డ్ వచ్చిందనే విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటోన్నారు. బాణాసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొంటోన్నారు. పుష్ప బ్యానర్లను ప్రదర్శిస్తోన్నారు.

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ బావా, పుష్ప ఘన విజయం సాధించడంలో, అవార్డులను సాధించడంలో అన్ని అర్హతలు ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు. యు డిజర్వ్ బావా అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

Allu Arjun

అవార్డు వచ్చిన ఆనందాన్ని అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. తండ్రి అల్లు అరవింద్‌ పాదాలకు నమస్కరించి.. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అక్కడే ఉన్న భార్య స్నేహారెడ్డిని గట్టిగా హత్తుకున్నాడు. కొడుకు అయాన్, కూతురు అర్హను ముద్దాడుతూ కనిపించారు. పుష్ప దర్శకుడు సుకుమార్, యూనిట్ సభ్యులు అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+