శోభన్ బాబు ఆస్తి విలువ రూ.80వేల కోట్లు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత కృష్ణ, శోభన్ బాబు స్టార్ హీరోలుగా వెలుగొందారు. శోభన్ బాబుకు మహిళా అభిమానులు కోట్ల సంఖ్యలో ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మహేష్ బాబుకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ సమయంలో శోభవన్ బాబుకు అంతే ఫాలోయింగ్ ఉండేది. ఎవర్ గ్రీన్ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు నటించిన ప్రతి సినిమా అభిమానులను మెప్పించింది. తన సినిమా విడులవుతోంది అంటే థియేటర్ దగ్గర మగవారికన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. టికెట్ల కోసం క్యూ కట్టేవారు.
కథానాయకుడిగా నటిస్తూ తాను సంపాదించిన సొమ్మును ఆస్తులు కొనుగోలు కోసం ఉపయోగించేవారు. భూమి మీద డబ్బు పెట్టుబడిగా పెడితే అది అంతకు రెట్టింపుతో తిరిగి మనదగ్గరకే వస్తుందని గట్టిగా నమ్మేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కోట్లరూపాయల ఆస్తులను కూడబెట్టారు. ఈ విషయాన్ని శోభన్ బాబు స్నేహితుడు, సీనియర్ నటుడు మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. శోభన్ బాబు సలహా మేరకే తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పేవారు.

శోభన్ బాబు గురించి ఎప్పుడు చర్చ వచ్చినా అందరూ మొదటిగా మాట్లాడేది ఆయన ఆస్తుల విలువ గురించే. చెన్నై చుట్టుపక్కల ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారంటారు. అన్నింటినీ లెక్కలు చూస్తే రూ.80వేల కోట్లకు పైగా ఉంటాయని తెలుస్తోంది. మరికొందరైతే శోభన్ బాబు ఆస్తుల విలువ లక్ష కోట్లరూపాయలుగా ఉంటుందని చెబుతారు. ఇన్ని ఆస్తులు సంపాదించిన శోభన్ బాబు తన కొడుకులను మాత్రం సినీ పరిశ్రమకు పరిచయం చేయలేదు. వారు కూడా తమ తండ్రి ఇచ్చిన ఆస్తులను పెంచుతూ చెన్నైలో టాప్ రియల్టర్ గా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications