Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ తెలంగాణతో పెట్టుకున్నాడు .. పవన్ పై నెటిజెన్స్ పంచ్ లు!

కాకినాడ : మొత్తానికి.. హోదాపై ఏం మాట్లాడబోతున్నాడు? ఏం తేల్చేయబోతున్నాడు? పోరాటానికి సన్నద్దమవంటాడా? లాంటి ప్రశ్నలన్నింటికి తెరదించుతూ పవన్ ప్రసంగం పూర్తయిపోయింది. పవన్ ప్రసంగంలో ఇప్పుడు ఎవరికి కావాల్సిన సమాధానాలు వారు వెతుక్కుంటున్నారు. పవన్ ప్రసంగమంతా పజిల్ లాంటిదే అని సాక్షి లాంటి పేపర్లు విమర్శిస్తే.. తెలంగాణపై మళ్లీ తన అక్కసు వెళ్లాగక్కాడంటూ కొంతమంది నెటిజెన్స్ పవన్ పై పంచ్ లు పేల్చారు.

అందులో మచ్చుకు కొన్ని.. :

1)ప్రణయ్ రాజ్ వంగరి

'ఏదేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని' రాసింది గురజాడ అప్పారావు: పవన్ కళ్యాణ్
నువ్వు సూపరూ సారూ... మీఅంత జ్ఞానం లేకపాయే మాకు...

ఇది నిజమే.... అలా వదిలేయకండి ఇక..

2)కేవీ కూర్మనాథ్

'మనమే ఒక సైన్యం కానీ మీరు పోరాడకండి పోరాటం వాళ్ళు చేస్తారు'

వాళ్ళు హోదా ఇవ్వం అని స్పష్టంగా చెప్పేసారు.
వీళ్ళు ఇక అడగం అని మరీ స్పష్టంగా తేల్చేశారు.
ఇక తేల్చుకోవాల్సింది మీరే.
బోడి అవంతి రాజీనామా చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత. బాబుని అడగండి రాజీనామా చెయ్యమని. తగూ తేలిపోతుంది. వెంకయ్య ఏం చేస్తాడు? మోడీని అనండి, హోదా ఇవ్వకపోతే తొక్కతీస్తా అని.

Social media satires on Pawan Kalyan for targeting telangana in Kakinada meet

3)సందీప్ రెడ్డి కొత్తపల్లి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ ..

అమ్మా
మాదాకోళం త‌ల్లీ ..
(ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాటం)
సినిమాలు మానేయ‌మంటే ఇప్పుడే మానేస్తా ..
కాకుంటే నాకు మీరే తిండిపెట్టాలి .. ఇంటింటికి వ‌చ్చి అడుక్కుంటా

తెలంగాణకు అన్యాయం జరిగిందని సామాజిక తెలంగాణకు ఎందుకు ఒప్పుకన్నవ్ ..
ఎందుకు వెనక్కి తగ్గి మోసం చేసినవ్

4)మోహన్ రావిపాటి

తీపి కబురు చెప్తారనుకుంటే , రెండు లడ్లు చేతిలో పెట్టారు - పికె
ఏం లడ్లు మాత్రం స్వీట్లు కావా !! ఎంత లడ్లు నీకిష్టం లేకపోతే మాత్రం !! నీకిష్టమైన పాలకోవానే కావాలంటే ఎట్టా !!

5)మంచాల శ్రీనివాసరావు

తెలంగాణ ఏర్పడ్డాక పదకొండు రోజులు బువ్వ తినలేదట హీరో... తెలంగాణలోని అభిమానులూ వింటున్నారర్రా!?

పవన్ కల్యాణ్ బలమైన పోటీ అంటే.... తెలంగాణలో జానారెడ్డి, కేకే.... ఆంధ్రాలో బాలయ్య... అంతే... ఇంకెవరూ కాదు!!

ఏమయ్యా.... జేసీ.... ఏం, మీ తాడిపత్రిలో మంచి కారంపొడి దొరకదా? కాస్త పూసుకొని పోవచ్చుగా పార్లమెంటుకి? మాట్లాడితే రెడ్డినంటావు, సీమ బిడ్డనంటావు, యేడ పన్నావు సామీ?!

Social media satires on Pawan Kalyan for targeting telangana in Kakinada meet

6)విజయ కేసరి

తెలంగాణ వెనుకబడింది కాబట్టి, మనం బాగుపడాలి కాబట్టి , బ్రిటిష్ వాళ్ళు పాలించి డెవలప్ చేసిన ఆంధ్రప్రదేశ్ ల మన తెలంగాణ వాళ్ళను కలిపారట . ఎవరన్నా ఈ ఆంధ్రుడికి తెలంగాణ చరిత్ర చెప్పండిరా నాయన .

7)భరత్ పల్లెబోయిన

'నన్ను సీమాంద్రోన్ని చేసారు, ఏది మళ్ళను, ని ఎనక ఉన్నది ఆంధ్రోల్లు. రాయలసీమోల్లు ఇన్నారంటే తంతరు'

8)కరుణాకర్ దేశాయి

నీ సిగమేంది - నీ ఊగుడేంది - నీ వాగుడేంది - అసలు నీ కథ ఏంది ?

" గడ్డం గీసుకున్నత ఈజీగా తెలంగాణను విడ గొట్టినారు "
> 60 ఏండ్ల తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అసువులు బాసిండ్రో నీ అయ్యకు నీకు ఎరుకేనా !

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+