వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు ఆమె పేరు తెలియదా?: 'మహేష్ కత్తిని బెదిరించడం లంకేష్ హత్య లాంటిదే'

గురువారం నాడు పవన్ చేసిన ట్వీట్స్ లో గౌరీ లంకేష్ అన్న పేరుకు బదులు గౌరీ శంకర్ అనే హాష్ ట్యాగ్ తో పోస్టులు ఉన్నాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Trolled by Netizens పవన్‌కు ఆమె పేరు తెలియదా?: 'మహేష్ కత్తిని బెదిరించడం లంకేష్ హత్య లాంటిదే

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తిస్తున్న జర్నలిస్ట్, యాక్టివిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ధబోల్కర్, పన్సారే, కల్బుర్గి హత్యల మాదిరిగానే గౌరీ లంకేష్ హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

హిందుత్వ శక్తుల ఆగడాలపై ఆమె పదునైన గొంతుకగా మారినందువల్లే ఆమెను హత్య చేశారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం గౌరీ లంకేష్ హత్యపై స్పందించారు.

పవన్ ఏమన్నారు?:

'గౌరీ లంకేష్‌లాంటి వాళ్లని ఒక్కరిని చంపితే మరో లక్షల మంది గౌరీ లంకేష్‌లు పుట్టుకొస్తారు' అని పవన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అదే సమయంలో ఈ హత్యకు హిందుత్వ శక్తులే కారణమనడాన్ని ఆయన తప్పు పట్టడం గమనార్హం.

గౌరీ శంకర్ హాష్ ట్యాగ్:

గురువారం నాడు పవన్ చేసిన ట్వీట్స్ లో గౌరీ లంకేష్ అన్న పేరుకు బదులు గౌరీ శంకర్ అనే హాష్ ట్యాగ్ తో పోస్టులు ఉన్నాయి. దీంతో పవన్ అవగాహనరాహిత్యమంతా ఆయన పోస్టుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. పేరు కూడా సరిగా తెలుసుకోకుండానే పవన్ ఆవేశపడిపోతున్నారని నెటిజెన్స్ దుయ్యబడుతున్నారు.

పవన్‌పై సెటైర్స్:

పవన్‌పై సెటైర్స్:

'రాసిచ్చేవాళ్లు ఎవరో మరి.. సినిమాలు చేసుకోక ఎందుకొచ్చినంత బాధ నీకు' అంటూ మరికొంతమంది పవన్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజా ట్వీట్స్ తో పవన్ హిందుత్వ శక్తులను వెనకేసుకొచ్చారన్న అభిప్రాయాలు కూడా నెటిజెన్స్ వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మహేశ్ కత్తిని బెదిరించడంపై:

మహేశ్ కత్తిని బెదిరించడంపై:

గౌరీ లంకేష్ ను హత్య చేసినవారికి.. మహేశ్ కత్తి లాంటి వాళ్లను చంపేస్తామని బెదిరిస్తున్న వారికి పెద్ద తేడా లేదని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరి విషయంలోను భావ ప్రకటన స్వేచ్చకు ప్రత్యర్థులు అడ్డుపడ్డారని, వారి భావాలను గౌరవించకపోవడం సంగతి పక్కనపెడితే.. భౌతిక దాడులకు దిగుతామని బెదిరింపులకు దిగడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.

English summary
On Thursday Janasena President Pawan Kalyan posted tweets on Gouri Lankesh murder. In his tweets he wrongly mentioned her name
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X