మండుతున్న వైసీపీ-టీడీపీ సోషల్ మీడియా: చంద్రబాబు సైతం జోక్యం
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మినీ యుద్ధం నడుస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. చివరికి వాట్సప్ ప్లాట్‌ఫామ్స్ మీద ఈ రెండు పార్టీల సోషల్ మీడియా ప్రతినిధులు, సానుభూతిపరుల మధ్య రణరంగం సాగుతోంది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
యూకేలో నివసిస్తోన్నట్లుగా చెబుతోన్న స్వాతి రెడ్డి అలియాస్ స్వాతి చౌదరి అనే తెలుగుదేశం పార్టీ అభిమాని- ఈ మినీ యుద్ధానికి కేంద్రబిందువుగా మారినట్లు భావిస్తోన్నారు. చాలాకాలంగా ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని మార్ఫింగ్ ఫొటోలను సైతం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేశారు.

ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ వస్తోన్నారు. యూకేలో ఉండటం వల్ల తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో ఆమె ప్రభుత్వంపై ఇష్టానుసారంగా పోస్టులు వేస్తోన్నారనేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు వాదన. స్వాతి రెడ్డికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. స్వాతిరెడ్డికి ధీటుగా బదులిస్తోన్నారు.
ఈ మధ్య కాలంలో వైసీపీ సోషల్ మీడియా బలం పుంజుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు యాక్టివ్‌గా ఉంటోన్నందన ఆమె సాగిస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. గతంలో స్వాతి రెడ్డి.. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలు, పోస్టులన్నింటినీ వైసీపీ కార్యకర్తలు తవ్వి మరీ బయటికి తీస్తోన్నారు.

సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు ఇందులో జోక్యం చేసుకోవడం దీన్ని మలుపు తిప్పినట్టయింది. వైసీపీ సోషల్ మీడియా ఎదురుదాడి తీవ్రం కావడంతో టీడీపీ డిఫెన్స్‌లో పడటం వల్లే చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. స్వాతిరెడ్డిపై జరుగుతున్న ఎదురుదాడిలో విమెన్ కార్డ్‌ను చంద్రబాబు బయటికి తీశారు. స్వాతిరెడ్డికి తాను అండగా నిలుస్తున్నానని చెప్పారు.
ఇన్నిరోజులూ చంద్రబాబు ఆదేశాలతోనే స్వాతిరెడ్డి.. వైఎస్ జగన్, ఆయన కుటుంబీకులపై జుగుప్సాకరమైన, అసభ్యకరమైన పోస్టులు పెడుతోన్నారనే విషయం స్పష్టమైందని చెబుతున్నారు వైసీపీ అభిమానులు. వారిద్దరి వ్యవహార శైలిని ఎండగడుతున్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునే సత్తా లేక చివరికి చంద్రబాబు.. సోషల్ మీడియా వార్‌లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ ట్రోల్స్ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications