మోసం చేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని అరెస్టు

చెన్నైకి చెందిన శాంతన్ కృష్ణన్ (38) కొద్దికాలం క్రితం నగరానికి వచ్చాడు. ఇక్కడే నెల్లూరుకు చెందిన లలిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి గత సంవత్సరం మే నెలలో సోమాజిగూడ శ్రీ మల్లి టవర్స్‌లో డెస్ట్రీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు.
శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలిప్పిస్తామని ప్రకటనలు గుప్పించారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాల కోసం సంస్థ కార్యాలయానికి వచ్చారు. వారిని ఇంటర్య్వూ చేసి వారి తాహతును బట్టి 40 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు. శిక్షణతో పాటు నెలకు 10 వేల రూపాయలు జీతంగా ఇస్తామని వారికి నమ్మబలికారు.
రెండు, మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి జీతాలు చెల్లించారు. తరువాత జీతాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ శాంతన్ కృష్ణన్, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications