అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్
హైదరాబాద్: నగరంలో ఓ ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ తన పుట్టిన రోజునే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో జరిగింది. పోలీసులు అందించిన వివరాలా ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా ఆత్మకూర్ మండలం బట్టపాడు గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ ఆరేళ్లుగా హైదరాబాద్ నిజాంపేటలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. గత ఏడాది మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన వైద్యురాలు ప్రవల్లికతో వివాహం జరిగింది. కుటుంబ గొడవలతో మూడు నెలల క్రితం ప్రవల్లిక హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దాంతో ప్రవల్లిక తల్లిదండ్రులు నిరంజన్‌పై వరకట్నం కేసు పెట్టారు. ఈ వరకట్నం కేసులో నిరంజన్ కుమార్ రెండు నెలల జైల్లో ఉండి ఇటీవలే బెయిల్‌పై బయటకి వచ్చాడు. శుక్రవారం కేసు విచారణకు హాజరై అత్తగారి ఊరైన రాజారాంకు వచ్చాడు.
అర్ధరాత్రి తనకు బతకాలని లేదని, చనిపోతున్నానంటూ నెల్లూరులోని తమ్ముడు రంజిత్‌కు ఎస్‌ఎంఎస్ పంపించాడు. ఆ తర్వాత రాజారంలోని అత్తగారింటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్లపాటు ఉద్యోగం చేసిన తన అన్నయ్య... హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఉరివేసుకున్నాడో అర్ధం కావడం లేదని రంజిత్ పేర్కొన్నాడు. రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications