సాఫ్ట్‌వేర్ విద్యార్థి ఆత్మహత్య: భర్త రాలేదని భార్య సూసైడ్

Software student commits suicide in Hyderabad
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో జిరగింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన చంద్రశేఖర్ (27) సాఫ్ట్‌వేర్ శిక్షణ కోసం నగరానికి వచ్చాడు. ఎస్సార్ నగర్‌లోని ఉమా బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు.

సోమవారంనాడు గదిలో ఎవరూ లేని సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నడాు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చంద్రశేఖర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు అంటున్నారు.

ఇదిలా వుంటే, పెళ్లి రోజు భర్త ఇంటికి త్వరగా రాలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పి. కృష్ణంరాజు, లావణ్య భార్యాభర్తలు. ప్రగతినగర్‌లోని లక్ష్మీబలాజీ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు.

సోమవారంనాడు వారిది 14వ వివాహవార్షికోత్సవం. ఉదయం భర్త ఉద్యోగానికి వెల్లాడు. పెళ్లి రోజు కాబట్టి త్వరగా రావాలని భార్య కోరింది. తాను చెప్పినా సమయానికి రాలేదని అసంతృప్తికి గురై భార్య తలుపు గడియ పెట్టుకుని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరు పదేళ్ల నుంచి హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. కృష్ణం రాజు ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+