లోన్ తీసుకునేవారు ఒక్క నిముషం ఆగండి.. రూపాయికన్నా తక్కువ వడ్డీకే!
రుణరేట్లను సమీక్షిస్తుండటంవల్ల ఒక్కోసారి తక్కువ.. ఒక్కోసారి ఎక్కువ వడ్డీ పడుతుంటుంది.
రుణం తీసుకోవాలని భావించినప్పుడు మన అవసరాన్ని కొందరు వ్యక్తులు, కొన్ని ఆర్థిక సంస్థలు క్యాష్ చేసుకోవాలని చూస్తాయి. అత్యధిక వడ్డీ చెల్లించి మరీ రుణం తీసుకుంటాం. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం రూపాయికన్నా తక్కువకే వడ్డీ పడుతోంది. మీరు లోన్ తీసుకునే సమయంలో ఈ క్రింది బ్యాంకులు ఎంత వడ్డీ తీసుకుంటున్నాయో తెలుసుకొని తీసుకుంటే బాగుంటుంది. పలు బ్యాంకులు చౌక వడ్డీ రేటుకే రుణాలు అందుబాటులో ఉంచాయి. మీరు రూపాయి కన్నా తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు. ఏ ఏ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి లోన్ వస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిబిల్ స్కోరు ప్రాతిపదికన మనం తీసుకునే లోన్లపై వడ్డీరేట్లు మారుతుంటాయి. ఎప్పటికప్పుడు బ్యాంకులు రుణరేట్లను సమీక్షిస్తూ వస్తాయి. దీనివల్ల ఒక్కోసారి తక్కువ.. మరోసారి ఎక్కువ వడ్డీ పడుతుంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తారు. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.3 శాతం నుంచి ప్రారంభమైద్ది. ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తోంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 9.5 శాతం నుంచి ప్రారంభం అవుతుండగా 12.8 శాతం వరకు వడ్డీ ఉంటుంది. లోన్ అమౌంట్ ఎంతైతే అంతలో ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు.

ఇండియన్ బ్యాంక్ తర్వాతి స్థానంలో ఉంది. ఈ బ్యాంక్‌లో కూడా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతుండగా ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చౌక వడ్డీకే లోన్లు ఇస్తోంది. ఈ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.35 శాతంగా ఉంటుంది. గరిష్ట వడ్డీ రేటు 14.85 శాతం. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం తీసుకుంటారు.
HDFC బ్యాంక్‌లో అయితే వడ్డీ రేటు 10.35 శాతం నుంచి ప్రారంభం. గరిష్ట వ్డడీ రేటు 21 శాతం వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం వరకు ఉంటుంది.
క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభమవుతోంది. గరిష్ట వడ్డీ రేటు 24 శాతం. ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు 1 శాతంగా ఉంది.
IDFC ఫస్ట్ బ్యాంక్‌లో చూస్తే.. వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ఉంది. గరిష్ట వడ్డీ రేటు 24 శాతం వరకు పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 3.5 శాతం వసూలు చేస్తారు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 10.9 శాతం నుంచి ప్రారంభమవుతోంది. గరిష్టంగా 18.25 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఒక శాతం నుంచి 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
IDBI బ్యాంక్‌లో వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభమవుతుండగా గరిష్టంగా 15.45 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (SBI)లో చూస్తే.. వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభమవుతోంది. గరిష్టంగా 14 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 1.5 శాతం పడుతుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 11.15 శాతం నుంచి ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం నుంచి 1 శాతం వరకు తీసుకుంటారు.
యాక్సిస్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభిస్తారు. గరిష్టంగా 13.65 శాతం వరకు తీసుకుంటారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వడ్డీ రేటు 11.4 శాతం ఉంది. గరిష్టంగా 16.25 శాతం వరకు వడ్డీ తీసుకుంటారు. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications