విజయవాడ, వరంగల్, భద్రాచలం, కాకినాడ ప్రజలకు ముఖ్య సూచన

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉండే దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునే విధంగా సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే డివిజన్ల పరిధిలో డబుల్ లైన్ తోపాటు మూడోలైను నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. వీటిల్లో భాగంగా కాజీపేట-వరంగల్ మధ్య ప్రస్తుతం మూడోలైను పనులు జరుగుతున్నాయి. కీలకమైన విజయవాడ-కాజీపేట మార్గంలో ఈ లైను ఉంది. పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.

గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు,
సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు,
సికింద్రాబాద్-భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 6వ తేదీతోపాటు, 10 నుంచి 18 వరకు,
ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 5 నుంచి 19వ తేదీ వరకు రద్దు చేశారు.

 somany trains cancelled in vijaywada railway division

కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ ప్యాసింజర్‌ పుష్‌ఫుల్‌ ఈ నెల 10 నుంచి 18 వరకు,
కాజీపేట-తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 10 నుంచి 18 వరకు
గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 11 నుంచి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది.
భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6 నుంచి 8 వరకు, 10 నుంచి 19 వరకు హసన్పర్తి రోడ్ వరకు మాత్రమే నడవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+