వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల‌వ‌రంతో ఏపికి న‌ష్ట‌మా : తెలంగాణ వాదుల కొత్త వాద‌న : ఇందులో నిజ‌మెంత‌..!

|
Google Oneindia TeluguNews

పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల‌న ఏపికి లాభం కంటే న‌ష్టమే ఎక్క‌వ అంటూ కొంద‌రు తెలంగాణ వాదులు తెర మీదకు తెచ్చారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా ఉధృతంగా ప్ర‌వ‌హించే న‌ది మ‌ధ్య‌లో ఇలాంటి ప్రాజెక్టు చేప‌ట్ట‌లేద‌ని గుర్తు చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుప‌డుతోందంటూ టిడిపి నేత‌లు ప్ర‌చారం చేసారు. అయితే, పోల‌వ‌రం ప్రాజెక్టుకు తాము అడ్డు కాదంటూ తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర స్ప‌ష్టం చేసారు. ఇప్పుడు మ‌రోసారి పోల‌వ‌రం పైన మొద‌లైన వాద‌న కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

ఏపికి లాభం కంటే న‌ష్ట‌మే..

పోల‌వ‌రం పైన మ‌రో వాద‌న కొత్త‌గా తెర మీద‌కు వ‌చ్చింది. కొంద‌రు తెలంగాణ వాదులు ఈ ప్రాజెక్టు కార‌ణంగా ఏపికి లాభం కంటే న‌ష్టమే ఎక్కువ అంటూ త‌మ వాద‌న వినిపిస్తున్నారు. ఇంత‌లా ఉధృతంగా ప్ర‌వ‌హించే న‌ది మ‌ధ్య‌లో ఇంత‌టి భారీ ప్రాజెక్టు ఎక్క‌డా చేట్ట‌లేద‌ని చెబుతున్నారు. 7.2 ల‌క్ష‌ల ఎక‌రాల సాగునీరు అందించ‌వ‌చ్చ‌ని చెబుతున్నార‌ని.. కానీ అనేక ఎత్తిపోత‌ల ప‌ధ‌కాలు ప్రాజెక్టుల ద్వారా పోల‌వ‌రం కింద సాగ‌య్యే ప్ర‌తీ ఎక‌రానికి ప్ర‌స్తుతం నీరందుతోంద‌ని వారు వివ‌రిస్తున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు త‌గ్గించాల‌ని మొదటి నుండి నిపుణులు సూచిస్తున్నార‌ని.. రీడిజైన్ చేయ‌కుండా ప్రాజెక్టును నిర్మిస్తే భ‌ద్రాచ‌లం ముంపున‌కు గురి అవుతుంద‌న్న‌ది వారి ఆందోళ‌నగా క‌నిపిస్తోంది. పోల‌వరం నుండి 120 కిలో మీట‌ర్ల మేర బ్యాక్‌వాట‌ర్ ద్వారా ముంపుకు గుర‌వుతున్న‌ద‌న్న‌ది వారి వాద‌న‌.

some of the Telangana leaers Expressing doubt on Polavaram..AP Officials denied

ఏపికి ప్ర‌మాదం అంటూ..
పోల‌వ‌రం క‌ట్టే ప్రాజెక్టు క‌ట్టే నేత సున్నిత‌మైంద‌ని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. భూకంప ప్ర‌భావిత ప్రాంతం అంటూ ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగితే భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌న్న‌ది వారి వాద‌న‌. ఇక‌, దీనిపైన పొరుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోర్టులో కేసులు వేసిన విష‌యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పోల‌వ‌రం రీడిజైన్ 36 ల‌క్ష‌ల క్యాసెక్కుల వ‌ద‌ర ప్ర‌వాహ సామర్ధ్యానికి మాత్ర‌మే కేంద్ర జ‌ల‌సంఘం అనుమ‌తి ఇచ్చింద‌ని..కానీ, ఏపి మాత్రం 50 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు పెంచింద‌ని వారు చెప్పుకొస్తున్నారు.

ఇక‌, వీరి వాద‌న ఇలా ఉంటే..కొద్ది రోజుల క్రితం వ‌ర‌కూ దీని పైన రాజ‌కీయంగానూ ర‌గ‌డ జ‌రిగింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి పోల‌వ‌రం ప్రాజెక్టుకు వ్య‌తిరేకమంటూ ఏపి సీయం ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాము పోల‌వ‌రం కు వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేసారు. మ‌రి..తాజాగా మ‌రోసారి తెలంగాణ వాదులు ఈ అనుమానాలను వ్య‌క్తం చేయ‌టం పైనా ఏపి అధికారులు మాత్రం భిన్నంగా స్పందిస్తూ..వాటిని కొట్టి పారేస్తున్నారు.

English summary
Some of the Telangana leaders expressing doubt on Polavaram Construction. They says Polavaram is more loss for AP than what they expecting gain. But, AP Officials denied these comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X