ఆ దెబ్బతో భయం, నెరవేరేనా: పవన్ కళ్యాణ్‌పై జగన్ మైండ్ గేమ్!?

2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగనున్న సమయంలో ఆయన పైన ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేక ప్రచారం సాగుతోందా?అంటే అవుననే అంటున్నారు.

హైదరాబాద్: 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగనున్న సమయంలో ఆయన పైన ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేక ప్రచారం సాగుతోందా? అంటే అవుననే అంటున్నారు.

కత్తి మహేష్ నుంచి జగన్ వద్ద డిమాండ్ దాకా

కత్తి మహేష్ నుంచి జగన్ వద్ద డిమాండ్ దాకా

సినీ ప్రముఖులు కత్తి మహేష్ నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన కోసం ఉప ముఖ్యమంత్రి పదవిని వైసిపి అధినేత జగన్ వద్ద డిమాండ్ చేశారనే అంశాలు చూస్తుంటే జనసేనానిపై దుష్ప్రచారానికి తెరలేపారని అర్థమవుతోందని అంటున్నారు.

Recommended Video

    YSRCP Is Planning To Tie Up With The Jana Sena పవన్ కళ్యాణ్ 'డిప్యూటీ సీఎం' డిమాండ్ | Oneindia Telugu
    పవన్ కళ్యాణ్ అంటే భయం

    పవన్ కళ్యాణ్ అంటే భయం

    పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఓ మాట చెబుతున్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజలు ముఖ్యమని చెబుతున్నారు. నిజంగానే ఆయనకు పదవులు కావాలని ఉంటే బిజెపికి, టిడిపికి దగ్గరై తీసుకునే వారని, కానీ వారిపై పోరాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే 2019లో తమ ఓట్లకు ఎక్కడ గండికొడతారోననే ఉద్దేశ్యంతో ఇప్పిటి నుంచే ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని, పవన్ అంటే వారిలో భయం కనిపిస్తోందని అంటున్నారు.

    దారుణమైన ప్రచారం

    దారుణమైన ప్రచారం

    2014లో పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపిలకు మద్దతు పలికారు. 2019లో మాత్రం ఒంటరిగా లేదా లెఫ్ట్ పార్టీలతో కలిసి రంగంలోకి దిగే అవకాశముంది. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. ఆయన వస్తే తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని భావించి కొందరు ఆయనపై దారుణమైన ప్రచారం చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.

    ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పాక..

    ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పాక..

    తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతానని పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. ఆ తర్వాత ఆయనపై మరింత దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. కత్తి మహేష్‌ను కొందరు పావుగా వాడుకున్నారనే ప్రచారం కూడా సాగింది. దానిని ఆయన ఖండించడం వేరే విషయం.

    ఆసక్తికర ప్రచారం

    ఆసక్తికర ప్రచారం

    తాజాగా, మరో ఆసక్తికర వాదన తెరపైకి వచ్చింది. 2019లో పొత్తుతో వెళ్దామంటే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కొందరికి మంత్రివర్గంలో చోటివ్వాలని పవన్ కళ్యాణ్.. జగన్‌ను అడిగారని, దానికి ఆయన అంగీకరించారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ అలాంటి డిమాండ్ తెరపైకి తెచ్చారని వట్టి ప్రచారమే అంటున్నారు.

    పవన్‌ను అలా దెబ్బకొట్టేందుకు వైసిపి వేసిన ప్లానా?

    పవన్‌ను అలా దెబ్బకొట్టేందుకు వైసిపి వేసిన ప్లానా?

    పవన్ కళ్యాణ్ జనసేనకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అడిగారని ప్రచారం జరిగింది. అదే సమయంలో తాము జనసేనతో పొత్తు పెట్టుకోమని వైసిపి తేల్చి చెప్పింది. అంటే పవన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విపక్షమే ఆ డిమాండ్లు వచ్చాయని ఉద్దేశ్యపూర్వకంగా లీక్ చేసి, ఆ తర్వాత తాము పొత్తు పెట్టుకోమని చెప్పడం ద్వారా జనసేనానిపై మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోందనే వారు లేకపోలేదు.

    ఆ ఓట్లపై వైసిపి కన్ను

    ఆ ఓట్లపై వైసిపి కన్ను

    2014లో కాపులు టిడిపికి మద్దతు పలికారు. 2019లో వారిని మచ్చిక చేసుకోవాలని వైసిపి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గంతో పాటు యువత పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇప్పటి నుంచే పవన్ పైన వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా ఎంతోకొంత తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+