చంద్రబాబు గారు, జగన్ 'చెప్పాడు': రోజా చెవిలో చెప్పడంపై అసహనం?

వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజాకు చెవిలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్లీనరీలో ఉమ్మారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అమరావతి: వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజాకు చెవిలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్లీనరీలో ఉమ్మారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఉమ్మారెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు మహానాడు, ఇతర సమావేశాల తీర్మానాలను రూపొందించేవారు. వైసిపి ప్లీనరీలోను తీర్మానాలు మొదలు నాయకుల ప్రసంగాలను ఆయన వేదికపై ఉండి పర్యవేక్షించారు.

ప్లీనరీ తొలి రోజు రోజా మాట్లాడుతుండగా ఆమె వద్దకు వచ్చి చంద్రబాబును తిట్టమని చెబుతున్నారని, బాగా తిట్టమని చెప్పారు. మైక్ ఆన్ చేసి ఉండటంతో ఈ వ్యాఖ్యలు అందరికీ వినిపించాయి.

Some YSRCP leader unhappy with Ummareddy?

ఎవరిని అని రోజా ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని తిట్టమంటున్నారని ఉమ్మారెడ్డి చెప్పారు. అంతుకముందే జగన్ తిట్టమన్నాడని చెప్పేందుకు ఉమ్మారెడ్డి.. 'చెప్పాడు' అన్నారు.

ఇక్కడ, చంద్రబాబును గౌరవించడం, జగన్‌ను చెప్పాడు అని ఏకవచనంతో సంభోదించడం పైన పార్టీలోను చర్చ జరుగుతోందంటున్నారు.

ఉమ్మారెడ్డి సంభోదనను వైసిపి నేతలు సీరియస్‌గా తీసుకోనప్పటికీ, ఒకరిద్దరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. చంద్రబాబును గౌరవించడం, జగన్‌ను 'చెప్పాడు' అని వ్యాఖ్యానించడం పార్టీలో చర్చకు దారి తీసిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+