కాపీ అందాక: కన్వెన్షన్‌పై సోమేష్, నాగ్‌కి చిక్కు తప్పదా
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన చర్యల విషయమై జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) స్పందించింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి హైకోర్టు ఆదేశాలు అందనందునే తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ చైర్మన్ సోమేష్ కుమార్ తెలిపారు. కోర్టు కాపీలు అందాక తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంసిద్ధమైంది. ఇప్పటి వరకు 18 సర్కిళ్లలో 890 అక్రమ నిర్మాణాలను తొలగించారు. మంగళవారం నాడు 172 అక్రమ నిర్మాణాలు కూల్చి వేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, తమ్మిడికుంట చెరువును ఆనుకొని ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కొంత భాగంలో షెడ్డును యాజమాన్యమే తొలగించింది. శనివారం, ఆదివారం నాడు కొంత భాగాన్ని తొలగించింది.
గత నెల 28వ తేదీన జీహెచ్ఎంసీ, నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా తమ్మిడికుంట చెరువును సర్వే చేశారు. ఈ సందర్భంగా 3.12 ఎకరాల చెరువు స్థలం ఎన్ కన్వెన్షన్‌లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ సర్వేకు వ్యతిరేకంగా ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.
వివాదం కోర్టులో ఉండటంతో ఆ కట్టడాలను కూల్చకుండా అధికారులు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో యాజమాన్యమే స్వయంగా చెరువు వైపు ఉన్న షెడ్డును తొలగించింది. అధికారులు నిర్ణయించిన హత్తుల ప్రకారం కన్వెన్షన్ సెంటర్‌లో దాదాపు సగం వరకు కూల్చివేయాల్సి ఉంటుంది. అధికారుల నివేదిక అనుగుణంగా కూల్చివేస్తారా లేదా కొంత కూల్చివేస్తారా అనేది చూడాలి.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications