వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి వ్యాఖ్యలా?: జగన్‌పై సోమిరెడ్డి ఫైర్, ‘జనసేనని వ్యాఖ్యలు సరైనవే’

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ తనకు తాను గొప్ప వ్యక్తినని అనుకోవడం పొరపాటు మంత్రి హితవు పలికారు.

Recommended Video

నలుగురు నలుగురు పెళ్లాలు!: పవన్‌పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
పవన్‌పై ఇలాంటి వ్యాఖ్యలా?

పవన్‌పై ఇలాంటి వ్యాఖ్యలా?

పవన్‌ వ్యక్తిగత జీవితం గురించి ఈ విధంగా మాట్లాడటం సరికాదని, జగన్‌ ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని సోమిరెడ్డి అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై పవన్‌ విమర్శించినా.. సీఎం చంద్రబాబు ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. జగన్‌కు, చంద్రబాబుకు అదే తేడా అని అన్నారు.

 పవన్‌పై ఇలాంటి వ్యాఖ్యలా? పవన్ విమర్శలో తప్పులేదు..

పవన్‌పై ఇలాంటి వ్యాఖ్యలా? పవన్ విమర్శలో తప్పులేదు..

అవినీతి కేసుల గురించి జగన్‌ ఏమంటారు? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ పోరాటం ఉండాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అసెంబ్లీకి రాకుండా జగన్‌ తప్పు చేస్తున్నారని పవన్‌ చేసిన విమర్శలో తప్పు లేదని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

డిప్రెషన్‌లో జగన్..

డిప్రెషన్‌లో జగన్..

జగన్‌ డిప్రెషన్‌లో ఉన్నారని ఈ విమర్శలతో అర్థమయిపోయిందని సోమిరెడ్డి అన్నారు. జగన్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో నిర్లిప్తత కనబడుతోందని వ్యాఖ్యానించారు. తామూ జగన్‌ను రాజకీయంగా విమర్శిస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా కాదని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు.

ధైర్యం లేక బయట తిరుగుతున్నారు

ధైర్యం లేక బయట తిరుగుతున్నారు

ఇది ఇలా ఉండగా, చట్టసభల్లో ఉండి పోరాడే ధైర్యం లేక బయట తిరుగుతున్న ప్రతిపక్ష నేత జగన్‌.. పరిపక్వత లేని వాఖ్యలు చేస్తున్నారని జనసేన పీఏసీ కన్వీనర్ మాదాసు గంగాధరం మండిపడ్డారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామర్లకోటలో జగన్ చేసిన వ్యాఖ్యలపై గంగాధరం తీవ్రంగా మండిపడ్డారు.

చట్ట విరుద్ధ పనులు చేసి.. జైలుకెళ్లొచ్చి..

చట్ట విరుద్ధ పనులు చేసి.. జైలుకెళ్లొచ్చి..

పవన్ చట్టపరంగా విడాకులు తీసుకున్న తర్వాతే మళ్లీ పెళ్లి చేసుకున్నారని, జగన్ మాత్రం చట్టవిరుద్ధంగా వ్యవహరించి వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఆ కేసుల మీద జైలుకెళ్లొస్తున్నారని గంగాధరం విమర్శించారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమేనని.. కానీ మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని హితవు పలికారు.

పవన్ ఎప్పుడూ అలా చేయలేదు

పవన్ ఎప్పుడూ అలా చేయలేదు

ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలని.. అక్కడ ప్రజా సమస్యలు చర్చిస్తేనే పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో పవన్‌ హితవు చెబితే.. జగన్ అసహనానికి గురవుతున్నారని అన్నారు. జగన్ చట్టసభల నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌కళ్యాణ్ ఎప్పుడూ ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని.. అది జనసేన సిద్ధాంతంలోనే లేదని చెప్పారు. జగన్‌కు మంచి బుద్ది, సహనం కలగాలని, మంచి మాటలు మాట్లాడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గంగాధరం తెలిపారు.

English summary
Andhra Pradesh minister Somireddy Chandramohan Reddy on Wednesday fired at YSRCP president YS Jaganmohan Reddy for blaming Janasena Chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X