పులివెందుల పులి పడకేస్తాడా? పరువు తీసుకుంటున్నారు: జగన్‌పై సోమిరెడ్డి సెటైర్లు

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంపాల్సిన అవసరం తమకు లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన గురించి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

 కత్తికి రక్తపు మరకలు లేకుండా ఎందుకు చేశారు?

కత్తికి రక్తపు మరకలు లేకుండా ఎందుకు చేశారు?

జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తర్వాత బొత్స సత్యనారాయణ బంధువు తన దగ్గర కత్తి ఎందుకు పెట్టుకోవాలని, కత్తికి రక్తపు మరకలు లేకుండా ఎందుకు చేయాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. దాడిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసుల మీద, వైద్యుల మీద కూడా జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదా? అని నిలదీశారు.

పెడర్థారాలు తీస్తారా?

పెడర్థారాలు తీస్తారా?

జగన్మోహన్ రెడ్డిని చంపాలనుకుంటే అలాంటి పిల్లకాకిని పెడతామా? అని తాను నిన్న అన్నానని.. దానికి పెడార్థాలు తీశారని సోమిరెడ్డి మండిపడ్డారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలా తమకు అలాంటివి అలవాటు లేదని అన్నారు.

 వైసీపీ నేతలు పరువు పోగొట్టుకుంటున్నారు..

వైసీపీ నేతలు పరువు పోగొట్టుకుంటున్నారు..

నిందితుడు రాసిన పది పేజీలపైనా సీఐఎస్ఎఫ్ సంతకం చేసి ఇచ్చారని సోమిరెడ్డి చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరువు పోగొట్టుకుంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని అన్నారు.

బాబును ఏ1 అంటారా?

బాబును ఏ1 అంటారా?

విమానాశ్రయంలో చంపితే ప్రభుత్వంపైకి రాదనే ఈ హత్యకు ప్లాన్ వేశారని కొన్ని పత్రికలు రాశాయాని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ ను వదిలిపెట్టి.. చంద్రబాబు ఏ1 అని, డీజీపీని ఏ2 అని అంటారా? అని ప్రశ్నించారు. దాడి ఘటనపై గవర్నర్ నివేదిక అడగడమేంటని నిలదీశారు.

పులివెందుల పులి అంటారు కానీ..

పులివెందుల పులి అంటారు కానీ..

జగన్మోహన్ రెడ్డిని ఆయన పక్కనుండే చెత్త సలహాదారులే తప్పుదోవ పట్టిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. 12 కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిని చేసింది కూడా వాళ్లేనని అన్నారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి.. చిన్న కత్తి దాడి చేస్తే పడకేస్తాడా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఎవరు దాడి చేయించారో మొత్తం బయటికి తీస్తామని.. కొంచెం ఓపిక పట్టాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+