సామాజిక న్యాయానికి పాతర: బాబు, జగన్‌పై సోమిరెడ్డి..
హైదరాబాద్: సామాజిక తెలంగాణ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, ఆ బాధ్యత తమదేనని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ టిడిపియేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పాతరేసిందని చంద్రబాబు విమర్శించారు.
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతలపై పూలే పోరాడరాని అన్నారు. సామాన్యులను ప్రజాప్రతినిధులను చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం రావాలని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘాల నేత, ఎల్‌బి నగర్ టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి: సోమిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ సమావేశంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ దోపిడీలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్నారు. సిబిఐ నుంచి ఎఫ్‌బిఐ వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ఎదిగిందని వ్యాఖ్యానించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇంకొంత కాలం పాలించి వుంటే రాష్ట్రంలో గనులుండేవి కాదని ఆరోపించారు.
సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తా: కోడెల
తాను గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేటతో తనకున్న అనుబంధం విడదీయరానిదని అన్నారు. నరసరావుపేట ఎంపిగా రాయపాటి సాంబశివరావు గెలుపుకోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
టైటానియం కుంభకోణంపై ఎఫ్‌బీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదా అని సోమిరెడ్డి నిలదీశారు. ఈ కుంభకోణంతో జగన్ బ్యాచ్ క్రిమనిల్ చర్యలకు అంతర్జాతీయ ప్రమోషన్ వచ్చిందని విమర్శలు గుప్పించారు. వైయస్ కుటుంబం ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అవినీతి నిర్మూలనలో మొట్టమొదటి చర్య దీనిపై ఉంటుందని వెల్లడించారు. పొత్తులలో పట్టువిడుపులు ఉండాలని సూచించారు. బిజెపితో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో పూర్తి అవుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలియజేశారు.












Click it and Unblock the Notifications