వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటులు సహా బిజెపిలోకి, అంత పెద్దవాడిని కాదు: బాబుపై వీర్రాజు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనకు మార్కులు వేసేంత పెద్దవాడిని తాను కాదని బిజెపి నేత సోము వీర్రాజు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనకు మార్కులు వేసేంత పెద్దవాడిని తాను కాదని బిజెపి నేత సోము వీర్రాజు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలామంది బిజెపిలోకి వస్తారు

చాలామంది బిజెపిలోకి వస్తారు

వీర్రాజు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో పలు పార్టీల నేతలు, ప్రముఖులు, నటులు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే, చేరడానికి సిద్ధంగా వారెవరో ఆయన చెప్పలేదు.

పొత్తులపై నిర్ణయం వారిదే

పొత్తులపై నిర్ణయం వారిదే

పొత్తుల విషయమై ఏపీ బిజెపి నేతల నుంచి అమిత్ షా అభిప్రాయాలు తెలుసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టిడిపి నేతలు బిజెపిని విమర్శించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించడం మామూలైపోయిందని షాకు ఫిర్యాదు చేశారు.

బిజెపిని తరిమికొట్టే రోజులు ముందున్నాయి: కెవిపి రామచంద్ర రావు

బిజెపిని తరిమికొట్టే రోజులు ముందున్నాయి: కెవిపి రామచంద్ర రావు

ఏపీ ప్రయోజనాలు పక్కన పెట్టి,అమిత్ షాతో చంద్రబాబు విందు రాజకీయాలు సిగ్గుచేటు అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు వేరుగా విమర్శించారు. చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవం మంటగలిపాలన్నారు.

కేంద్రం నుంచి వైదొలగాలి

కేంద్రం నుంచి వైదొలగాలి

ఏపీపై చిత్తశుద్ధి ఉంటే టిడిపి వెంటనే కేంద్రం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. రాహుల్ నాయకత్వంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ ఏపీకి తీరని అన్యాయం చేశారని కెవిపి ఆరోపించారు.

బిజెపి దగాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని కెవిపి మండిపడ్డారు. అమిత్ షా అడుగులకు చంద్రబాబు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి - బిజెపి కూటమిని ఏపీ ప్రజలు తరిమి కొడతారని చెప్పారు.

English summary
BJP leader Somu Veerraju said that he is not big leader to talks about Chandrababu Naidu's rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X