అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ: బాబుకు సోము వీర్రాజు ఘాటు లేఖ
ఏపీ భారతీయ జనతా పార్టీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు.
అమరావతి: ఏపీ భారతీయ జనతా పార్టీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘాటు లేఖ రాశారు. కొందరు నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికలకు ముందు పార్టీ మారి అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడే నేతలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. వారు మళ్లీ గెలవకుండా అడ్డుకట్ట వేయాలన్నారు.

విశాఖపట్నంలో ఇటీవల వెలుగు చూసిన భూకుంభకోణం ఇసుక మాఫియా, అధిక ధరలకు మద్యం అమ్మకాలపై అఖిలపక్ భేటీ ఏర్పాటు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications