అత్తతో రాసలీలలు: మామ చేతిలో హతమైన అల్లుడు
చిత్తూరు: వావివరుసలు మరిచి పెట్టుకున్న లైంగిక సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్న అల్లుడిని మామ హతమార్చాడు. అల్లుడిని అతను అతి దారుణంగా హత్య చేసి కసి తీర్చుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించింది.

చిత్తూరు జిల్లా మదనపల్లిలోని కృష్ణానగర్‌లో మామ ఖలీం బాషా ఇంట్లో అన్వర్ బాషా కాపురం పెట్టాడు. దాంతో ఆగకుండా అత్తపై కన్నేసి లోబరుచుకున్నాడు. గత కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య లైంగిక సంబంధం కొనసాగుతూ వస్తోంది. అది చివరకు బయటపడింది.
దాంతో మామ ఆవేశం కట్టలు తెంచుకుంది. అల్లుడు అన్వర్ బాషాను కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు. అల్లుడి ప్రవర్తనపై విసిగిపోయి తాను ఈ హత్య చేసినట్లు ఖలీం బాషా పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications