మహిళల సందడి: సోనియాకి స్వీట్ అందేనా? (పిక్చర్స్)
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని గాంధీ భవన్‌లో పలువురు మహిళా నేతలు రక్తదానం చేశారు. బర్కత్‌పురా రెడ్ క్రాస్ సొసైటీ దీనిని అందించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు సందడి చేశారు.
మరోవైపు సోనియా పుట్టిన రోజు నాడు సీమాంధ్రలో విభజన నిర్ణయం నేపథ్యంలో ఆగ్రహావేషాలు పెల్లుబుకాయి. సోనియా గాంధీ జన్మదినాన్ని ఉద్యోగ సంఘాలు విద్రోహ దినంగా పాటించాయి. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకురాలైన సోనియా జన్మ దినాన్ని విద్రోహ దినంగా పాటించాలని రాష్ట్ర ఎపిఎన్జీవో నేతల పిలుపు మేరకు జిల్లాల్లో ఉద్యోగులు సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, సోనియాగాంధీ, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు. జిల్లా కేంద్రంలో ఉద్యోగ, విద్యార్థి సంఘాల జెఎసి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

రక్తదానం - 1
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవనంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు రక్తదానం చేస్తున్న దృశ్యం.

రక్తదానం 2
ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవనంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు రక్తదానం చేస్తున్న దృశ్యం.

రక్తదానం 3
యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవనంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు రక్తదానం చేస్తున్న దృశ్యం.

సోనియా
యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవనంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు సోనియా చిత్రపటానికి మిఠాయి (కేక్) తినిపిస్తున్న దృశ్యం.

సోనియా గాంధీ
యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవనంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు సోనియా చిత్రపటానికి మిఠాయి తినిపిస్తున్న దృశ్యం.

గాంధీ భవన్
ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గాంధీ భవనంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు రక్తదానం చేస్తున్న దృశ్యం.

సమైక్యవాదులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలో పలువురు సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వానికి కర్మకాండ జరుపుతున్న దృశ్యం.












Click it and Unblock the Notifications