వెబ్‌సైట్లో నెంబర్లు: యువతులతో వ్యభిచారం, రెండు చోట్ల

 SOT police bust sex racket
హైదరాబాద్: నగరంలో పోలీసులు మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. పేట్ బషీరాబాదులోని కాలనీలో ఓ ఆపార్టుమెంటులో వ్యభిచారం జరుగుతోందని తెలుసుకున్న సమాచారంతో పోలీసులు బుధవారం నాడు రాత్రి రైడ్ చేశారు. ఈ దాడిలో పోలీసులు ఓ సెక్స్ వర్కర్‌ను, విటుడిని, అథడి సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.

షాపూర్ నగర్‌లో నివాసం ఉండే రేవంత్.. హైదరాబాదు కాల్ గర్ల్స్ వెబ్ సైట్‌లో ఫోన్ నెంబర్ పెట్టి యువకులను ఆకర్షిస్తున్నాడు. ఓ అపార్టుమెంటులో గదిని అద్దెకు తీసుకొని యువతులతో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రాజధాని కోల్‌కతాకు చెందిన సెక్స్ వర్కర్, విటుడు, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.

శారదా నగర్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టును కూడా పోలీసులు రట్టు చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం సాయంత్రం ఈ దాడి చేశారు. విటులు చంద్రశేఖర్, రాజ్ కుమార్, ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులు ఈ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు.

గోల్కొండ కోట మెట్లపై జారిపడ్డ విదేశీ పర్యాటకుడు

గోల్కొండ కోట కట్టడాలను తిలకించేందుకు వచ్చిన విదేశీ పర్యాటకుడు మెట్లపై నుంచి దిగుతుండగా కాలు జారి కిందపడడంతో గాయాలయ్యాయి. దక్షిణ కొరియాకు చెందిన నలుగురు పర్యాటకుల బృందం బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోటపై గల రాజ్‌దర్బార్‌, మహంకాళి ఆలయాన్ని తిలకించింది. కిందికి వచ్చేందుకు మెట్లు దిగుతుండగా పర్యాటకుడు కాలు జారిపడడంతో గాయమైంది. విషయం తెలుసుకున్న లంగర్‌హౌజ్‌ 108 అంబులెన్స్‌ నిర్వాహకులు అతనికి చికిత్స చేశారు.

స్టీల్‌ ఫ్యాక్టరీ యజమాని హత్య

హైదరాబాదులో బుధవారం ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. రాజేంద్రనగర్‌లోని ఏక్తా కాలనీకి చెందిన రఫీక్ (29)కు జల్‌పల్లిలోని పిట్టలగూడెం పక్కన డైమండ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ ఉంది. రోజూ ఇంటి నుంచి ఫ్యాక్టరీ వచ్చి వెళ్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఫ్యాక్టరీలో ఉన్నాడు.

4 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు రావడంతో బయటకు వెళ్ళా డు. కొద్దిసేపటి తరువాత జాఫర్‌ తోట పక్కన అతడి మృతదేహం కనిపించింది. గ్రామస్తులు గుర్తించి పహాడిషరీఫ్‌ పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+